అన్వేషించండి

Tirumala laddu Surprme Court : లడ్డూ కల్తీ జరిగిందనడానికి ఆధారాలేవి ? శ్రీవారి ప్రసాద వివాదంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court : లడ్డూ కల్తీపై ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.కల్తీ జరిగిన నెయ్యిని వాడలేదని ..వాడిన ట్యాంకర్లలో కల్తీ జరిగిందో టెస్టులు చేయించలేదన్నారు. వ గురువారానికి విచారణ వాయిదాపడింది.

Supreme Court opined that there is no evidence of laddu adulteration : తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన నాలుగు పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా లడ్డూ కల్తీ అయిందని ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనకు ఆధారాలు ఏమిటని  .. ప్రభుత్వ తరపు లాయర్ సిద్ధార్థ లూధ్రాను ధర్మాసనం ప్రశ్నించింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందన్నారు. ఈ సందర్భంగా సిద్దార్థ లూధ్రా నాలుగు ట్యాంకర్ల కల్తీని నెయ్యిని గుర్తించారని అంతకు ముందు అందే  కంపెనీ పంపించిన ట్యాంకర్లను ఉపయోగించారని గుర్తు చేశారు. అయితే ఆ ట్యాంకర్లలో కల్తీ జరిగిందా.. ఆ నెయ్యిని ఉపయోగించి సిద్ధం చేసిన లడ్డూలను టెస్టులకు పంపారా అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.

కేంద్ర ప్రభుత్వం విచారణ చేపడితే బాగుంటుంది  !

లడ్డూ కల్తీ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బాగుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థలూధ్రాను ధర్మాసనం ప్రశ్నించింది.   నెయ్యి కల్తీ జరిగిందన్న రిపోర్ట్‌పై సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకున్నారా లేదా అని ప్రశ్నించారు.  కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలన్నారు.  

పులివెందులో మంచం కింద పేలిన జిలెటిన్ స్టిక్‌- వీఆర్‌ఏ ప్రాణం తీసిన ప్రత్యర్థులు

సిట్‌ను నియమించిన తర్వాత మీడియాలో ప్రకటన చేయడం ఎందుకు ?

ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన తర్వాత  ప్రకటనలు చేశారని ఇక సిట్ సమర్థంగా ఎలా విచారణ జరపగలదని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రపంచంలో ఉన్న భక్తులందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని..  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఈ విచారణకు సరిపోతుందా  స్వతంత్ర దర్యాప్తు ఏదైనా అవసరమా అని కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను  సుప్రీంకోర్టు ప్రశ్నించింది.  తిరుమల లడ్డూ వివాదంపై ఇరువైపులా వాదనలు రికార్డు చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. గురువారం రోజు సిట్ విచారణ కొనసాగించాలా లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలా అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?

గురువారం కీలక నిర్ణయం వెలువరించే అవకాశం

తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గిపోవడంతో నెయ్యి ట్యాంకర్లను టీటీడీ అధికారులు టెస్టులు చేయించారు. అందులో జంతువుల కొవ్వు కలిపినట్లుగా తేలడంతో ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి నేతల సమావేశంలో ప్రకటించారు.అయితే లడ్డూ కల్తీ జరగలేదని.. దానికి ఆధారాల్లేవని కల్తీ అయిన ట్యాంకర్లను వెనక్కి పంపించారని భక్తుల మనోభావాలు దెబ్బతీశారని.. వైవీ సుబ్బారెడ్డితో పాటు మరో ముగ్గురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే సిట్ ను నియమించింది. సిట్ ను కొనసాగించాలా వద్దా అన్నదానిపై గురువారం విచారణలో కీలక నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించే అవకాశం ఉంది. 
 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirumala News: తిరుమలలో మూడోరోజు ముగిసిన సిట్‌ విచారణ, మంగళవారం విచారించేది ఎవరినంటే!
తిరుమలలో మూడోరోజు ముగిసిన సిట్‌ విచారణ, మంగళవారం విచారించేది ఎవరినంటే!
Haryana Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు- సగం మంది కోటీశ్వరులే, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 87 మంది నేర చరితులే
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు- సగం మంది కోటీశ్వరులే, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 87 మంది నేర చరితులే
Lava New 5G Phone: సూపర్ లుక్‌తో 5జీ ఫోన్ తీసుకురానున్న ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేస్తుంది!
సూపర్ లుక్‌తో 5జీ ఫోన్ తీసుకురానున్న ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేస్తుంది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirumala News: తిరుమలలో మూడోరోజు ముగిసిన సిట్‌ విచారణ, మంగళవారం విచారించేది ఎవరినంటే!
తిరుమలలో మూడోరోజు ముగిసిన సిట్‌ విచారణ, మంగళవారం విచారించేది ఎవరినంటే!
Haryana Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు- సగం మంది కోటీశ్వరులే, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 87 మంది నేర చరితులే
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు- సగం మంది కోటీశ్వరులే, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 87 మంది నేర చరితులే
Lava New 5G Phone: సూపర్ లుక్‌తో 5జీ ఫోన్ తీసుకురానున్న ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేస్తుంది!
సూపర్ లుక్‌తో 5జీ ఫోన్ తీసుకురానున్న ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేస్తుంది!
Nissan Magnite Facelift Bookings: నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ - లాంచ్ ఎప్పుడు? ధర ఎంత?
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ - లాంచ్ ఎప్పుడు? ధర ఎంత?
KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్లు’కి జాతీయ అవార్డు అర్హత ఉంది - 50 రోజుల వేడుకలో నాగబాబు!
‘కమిటీ కుర్రోళ్లు’కి జాతీయ అవార్డు అర్హత ఉంది - 50 రోజుల వేడుకలో నాగబాబు!
Siddaramaiah : సిద్ధరామయ్యకు మరిన్ని కష్టాలు - రంగంలోకి దిగనున్న ఈడీ !
సిద్ధరామయ్యకు మరిన్ని కష్టాలు - రంగంలోకి దిగనున్న ఈడీ !
Embed widget