అన్వేషించండి

AP BJP What Next : యువనాయకత్వమే ఏపీ బీజేపీకి కీలకం - వారికిస్తే రాత మార్చేస్తారా ?

పొరుగు రాష్ట్రాల్లో యువకులకు పగ్గాలిచ్చి మంచి ఫలితాలు రాబడుతోంది బీజేపీ హైకమాండ్. ఏపీలోనూ అదే ప్రయోగం చేస్తే బీజేపీ రాత మారుతుందా ? ఫైర్ ఉన్న బీజేపీ యువనేతలు ఆశాకిరణంగా కనిపిస్తున్నారా ?

AP BJP What Next :   ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సెంటర్ పాయింట్‌గా మారింది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓటు  బ్యాంక్ ప్రకారం చూసుకుంటే ఎవరూ లెక్క చేయకూడదు. కానీ అన్ని పార్టీలకూ భారతీయ జనతా పార్టీ కీలకంగా మారింది. వైఎస్ఆర్‌సీపీ బీజేపీ చల్లని చూపులను కోరుకుంటోంది. తెలుగుదేశం పార్టీ .. బీజేపీతో పొత్తు నుంచి విడిపోయి నష్టపోయామన్న అభిప్రాయంతో ఉంది. అందుకే నోరు మెదపడం లేదు. అదే సమయంలో జనసేన పార్టీ అడిగి మరీ బీజేపీతో పొత్తులోకి వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉండటమే అడ్వాంటేజ్ కాదు .. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో శరవేగంగా ఎదుగుతున్న వైనం కూడా అందర్నీ ఆకర్షిస్తోంది. కానీ ఏపీలో ఎందుకు బీజేపీ అనుకున్న స్థాయిలో ఎదుగడం లేదు. సరైన నాయకత్వాన్ని కేంద్ర పెద్దలు ఇవ్వకపోవడమేనా ?


పొత్తులతో నష్టపోయిన ఏపీ బీజేపీ !

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒకప్పుడు బలంగానే ఉండేది. కానీ కేంద్ర రాజకీయాల కోసం పెట్టుకున్న పొత్తుల వల్ల బీజేపీ ఎదుగుదల ఆగిపోయింది. ఇది చెప్పడానికి పెద్ద విశ్లేషణలు అవసరం లేదు. గతంలో ఆ పార్టీకి బలమైన స్థానాల్లో పోటీ చేస్తే.. పార్లమెంట్ స్థానంలో ఖచ్చితంగా మూడో స్థానం లభించేది. అయితే ఇప్పుడు ఆ పొత్తుల వల్ల తీవ్రంగా నష్టపోయింది.  పొత్తులు వికటించిన తర్వాత కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎదుగలేకపోతోంది. ఎంత మంది బీజేపీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉన్న నేతలు ఉన్నా.. పరిస్థితి మారడం లేదు. బలమైన నాయకుల్ని ఆకర్షించి పార్టీ నేతలను చేసినా అదే పరిస్థితి. ఎందుకు బీజేపీ సొంతంగా బలపడలేకపోతోంది ? అనేది మిస్టరీగానే మిగిలింది. 

పొరుగు రాష్ట్రాల్లో బలపడుతున్న బీజేపీ !

భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో మొదటి నుంచి బలంగా ఉంది.  తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు .. తెలంగాణలోనూ అదే పరిస్థితి. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుని కూడా తక్కువ స్థానాల్లో పోటీ చేయాల్సి వచ్చింది. టీడీపీతో పొత్తు లేనప్పుడు ఇంకా దారుణంగా పరాజయం చూడాల్సి వచ్చింది. అది మూడేళ్ల కిందటి మాట. కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణలో బీజేపీ అధికారం కోసం పోటీ పడుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ వంటి కంచుకోటల్ని బద్దలు కొట్టి.. ఇక అధికారమే తరువాయన్నట్లుగా దూసుకెళ్తోంది. ఇక తమిళనాడులోనూ ఆ పార్టీ ఇప్పుడు చురుగ్గా ఉంది. అన్నాడీఎంకేతో పొత్తులోభాగంగా  గెల్చుకున్న నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఉన్నా... ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతోంది. అక్కడ యువకుడైన అన్నామలైని టీ బీజేపీ అధ్యక్షుడిగా చేయడంతో సీన్ మారిపోయింది. అయన ప్రభుత్వంతో పోరాడుతున్నారు. దీంతో సహజంగానే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వర్గాలన్నీ బీజేపీ వైపు చేరుతున్నాయి.  

ఏపీలో యువనాయకత్వాన్ని హైకమాండ్  ఎందుకు ప్రోత్సహించడం లేదు?

ఇతర రాష్ట్రాల్లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు..  ఏపీకి వచ్చే సరికి సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త తరానికి వారి రాజకీయం కనెక్ట్ కావడం లేదని సహజంగానే అర్థం చేసుకోవచ్చు. ఏపీ బీజేపీలో కీలకమైన యువత నేతలు ఉన్నారు. మంచివాగ్ధాటి ఉన్న నేతలు ఉన్నారు. బీజేపీకి కాస్త బలం ఉన్న రాయలసీమలో విష్ణువర్ధన్ రెడ్డి, ఉత్తరాంధ్రలో మాధవ్ వంటి నేతలు ఉన్నారు. వారు బీజేపీ విధానాలను పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సిద్ధహస్తులు కూడా. మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం ఇంకాచెప్పాలంటే బీజేపీ విధానాలపై స్పష్టమైన అవగాహన ఉన్న నేతలు.  వారికి అవకాశం ఇస్తే సీన్ మారిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. కన్నా లక్ష్మినారాయణ తర్వాత బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా విష్ణువర్ధన్ రెడ్డి పేరు బాగానే వినిపించింది. కానీ సీనియర్‌గా ... సామాజికవర్గ కోణంలో పరిశీలించిస సోము వీర్రాజుకు ఇచ్చారు. ఇప్పుడు ఆయన పదవీ కాలం పూర్తయింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువనాయకత్వానికి చాన్స్ ఇస్తే బీజేపీ పరిస్థితిలో మార్పు వస్తుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
YS Jagan: ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
Snow In Desert: మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !
మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !
YS Jagan On DGP: అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు
అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు
Embed widget