అన్వేషించండి

BRS Politics : 100కుపై అసెంబ్లీ సీట్లు - కేసీఆర్ నమ్మకానికి కారణం ఓట్ల చీలికేనా ?

బీఆర్ఎస్ విజయంపై కేసీఆర్‌కు అంత నమ్మకం ఏమిటి ?గత ఎన్నికల నాటితో పోలిస్తే మారిన పరిస్థితులు !బలపడిన విపక్షాలు - సెంటిమెంట్ ఆయుధం దూరం!ముక్కోణపు పోటీలో ఓట్లు చీలి గెలుస్తామని భావిస్తున్నారా ?

 

BRS Politics :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 105 సీట్లలో గెలుపు ఖాయమని ప్రకటించారు. వందేళ్లలో చేయేలని అభివృద్ధి చేశామని.. చేసింది చెప్పుకుంటే చాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అత్యవసరంగా పిలిచిన నిర్వహించిన  మీటింగ్‌లో చెప్పింది ఇదే. కేసీఆర్‌కు అంత నమ్మకం ఏమిటన్నది పార్టీ నేతలకూ అర్థం కాని విషయం.  నిజానికి తెలంగాణలో ప్రస్తుతం అంత ఏకపక్ష వాతావరణం లేదని కానీ.. పార్టీ నేతల్లో నమ్మకం, ఆత్మ విశ్వాసం కల్పించడం.. నేతలు ఇతర పార్టీల వైపు చూడకుండా ఉండటానికి ఇలా చెప్పారని ఎక్కువ మంది భావిస్తున్నారు.  

గత ఎన్నికల నాటితో పోలిస్తే పూర్తిగా మారిన పరిస్థితులు

2018లో భిన్నమైన  రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అప్పటికి తెలంగాణ సెంటిమెంట్ ఇంకా చల్లారలేదు.  ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యంతో సెంటిమెంట్ ఓటర్ల ప్రధాన ఓటింగ్ అంశం అయింది. దానికి తోటు రైతు బంధు పథకాన్ని అప్పుడే తీసుకు వచ్చారు. నేరుగా రైతులు చెక్కులు ఇచ్చి.. డబ్బులు కళ్ల జూసేలా చేశారు. దీంతో ఆ ఓటు బ్యాంక్ కలిసి వచ్చింది. రెండో సారి తిరుగులేని విజయం వచ్చింది. మరి ఇప్పుడు అప్పట్లా పరిస్థితులు ఉన్నాయా అంటే  లేవన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.  సహజ సిద్ద ఆయుధం అయిన సెంటిమెంట్ ను కేసీఆర్   వదిలేశారు.  టీఆర్ఎస్ పార్టీనే ఏకంగా బీఆర్ఎస్ అని మార్చేశారు. బెంచ్ మార్క్ పథకాలు .. ఎక్కువ మందిలో అసంతృప్తికి కారణం అవుతున్నాయి.  దళిత బంధు పథకం అందిన వారు మినహా ఇతరులు అసంతృప్తిగా ఉన్నారు. ఇతర వర్గాలు కూడా మాకేంటి అనుకుంటున్నాయన్న ప్రచారం జరుగుతోంది. 
  
రాజకీయంగా బలపడిన విపక్షాలు !

గత ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలపడలేదు. ఆ పార్టీలో వర్గ పోరాటం.. టీడీపీతో  పొత్తు కారణంగా ఆ పార్టీ బలహీనం అయింది. అప్పట్లో బీజేపీ దీన స్థితిలో ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా పుంజుకున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా పోరాడుతోంది. ఓ వైపు రేవంత్.. మరో వైపు భట్టి విక్రమార్క పోదయాత్రలు చేస్తున్నారు. కర్ణాటకలో గెలుపు తర్వాత ఆర్థిక వనరులకు కూడా లోటు ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.   ఇక భారతీయ జనతా పార్టీ కూడా బలపడింది. గత ఎన్నికల్లో వేళ్ల మీద లెక్క పెట్టగలిగినన్ని  చోట్ల మాత్రమే డిపాజిట్ తెచ్చుకుంది. కానీ ఈ సారి మాత్రం ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. వారిలో ఎంత బలవంతులు అనేది పక్కన పెడితే పెరిగిన బీజేపీ క్రేజ్ ను ఈ విషయం తెలియచేస్తుంది. ఎలా చూసినా ఇప్పుడు తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు బలపడ్డాయనే. 

ఓట్లు చీలుతాయనే కేసీఆర్ ధీమానా ? 

ముక్కోణపు పోటీలో మూడు పార్టీలూ హోరాహోరీగా తలపడితే మాత్రం కేసీఆర్ మూడో సారి విజయం సాధిస్తారనే అంచనా మొదటి నుంచి ఎన్నికల నిపుణులు వేస్తున్నారు.  కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్న ఎన్నికల ట్రెండ్ ను చూస్తే..  ప్రజలు రేసులో ఎన్ని పార్టీలు ఉన్నా.. ఒకే పార్టీ వైపు మొగ్గుతున్నారు. మొన్న పంజాబ్.. నిన్న కర్ణాటకలను చూస్తే ఇదే అర్థం అవుతుంది. తెలంగాణలో ప్రజలు కేసీఆర్ పదేళ్ల పాలన చాలు అనుకుంటే.. ఓ ప్రత్యామ్నాయం వైపు మొగ్గుతారు. ఆ ప్రత్యామ్నాయం బీజేపీ, కాంగ్రెస్ నా అన్నది తేల్చుకుంటారు. ఓట్లు చీలిపోతే మాత్రం  బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ కనిపించవచ్చు  ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండాలా వద్దా అన్నది నిర్ణయించుకునేది ఈ ఆరు నెలల్లోనే. ఇప్పుడే అసలు రాజకీయం ప్రారంభమైందని అనుకోవచ్చు. కేసీఆర్ తమ నేతల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు వంద లెక్కలు చెబుతున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
WhatsApp Ban: వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
వాట్సాప్ ఇలా చేస్తున్నారా? - మీ అకౌంట్ బ్యాన్ చేస్తారు జాగ్రత్త!
Padi Kaushik Reddy : కలెక్టరేట్ లో మరో ఎమ్మెల్యేతో వాగ్వాదం - పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
కలెక్టరేట్ లో మరో ఎమ్మెల్యేతో వాగ్వాదం - పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
Vishnu Manchu: తిరుపతిలో 120 మంది అనాథలను దత్తత తీసుకున్న విష్ణు మంచు... విద్యావంతులను చేసే బాధ్యత కూడా!
తిరుపతిలో 120 మంది అనాథలను దత్తత తీసుకున్న విష్ణు మంచు... విద్యావంతులను చేసే బాధ్యత కూడా!
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Embed widget