అన్వేషించండి

Sharmila : షర్మిలకు కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చిందా ? పార్టీ విలీనం ఇప్పుడల్లా లేనట్లేనా ?

కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం ఎందుకు ఆగిపోయింది? షర్మిల రాజకీయ భవిష్యత్ డైలమాలో పడిందా ?


Sharmila :  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకుంటున్నారు. అగ్రనేతలంతా హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకున్నారు. కానీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. డీకే శివకుమార్ తో షర్మిల సమావేశం అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఢిల్లీలో రాహుల్, సోనియాలతో షర్మిల చర్చలు జరిపారు.. ఆ తర్వాత ఎలాంటి సమాచారం షర్మిలకు అందలేదు. ఆమె ఎదురు చూస్తున్నారు. శివకుమార్ కూడా ఏదీ చెప్పడం లేదు. దాంతో  ముందు ముందు తన రాజకీయ భవిష్యత్‌పై షర్మిలకు టెన్షన్ ప్రారంభమయింది. 

కాంగ్రెస్ లో విలీనంపై సమస్యలు                                                     

కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం  చేయడానికి షర్మిల సిద్ధంగా ఉన్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం సిద్ధంగా లేరు. షర్మిల వల్ల ఒక్క ఓటు రాకపోగా.. భారీగా నష్టం జరుగుతుందని గట్టిగా హైకమాండ్ వద్ద వాదించారు. వారికి ఇష్టం లేకుండా షర్మిలను పార్టీలోకి తీసుకునేంత ధైర్యం హైకమాండ్ చేయలేకపోయింది. మరో వైపు షర్మిల  కూడా తనకు తన అనుచరులకు టిక్కెట్లు డిమాండ్ చేస్తున్నారు. తనకు పాలేరు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని ఆమె  పట్టుబడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఆమె వల్లనే నష్టం అనుకుంటూ ఉంటే.. ఇంకా టిక్కెట్లు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగా పార్టీ విలీనానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 

కాంగ్రెస్ తరపున ఏపీలో రాజకీయంకూ చాన్స్ లేనట్లే !

ఎలా చూసినా తెలంగాణ రాజకీయాల్లో షర్మిలకు ఇప్పుడు ఎలాంటి స్థానం కనిపించడం లేదు. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా దాని వల్ల వచ్చిన ఇంపాక్ట్ అసలు లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే్ సమయంలో ఆమె పార్టీకి నిర్మాణం లేదు. కనీసం నిర్మాణం లేకపోవడం వల్ల అభ్యర్థులు కూడా లేరు. ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో  లీడర్ అంటే షర్మిల మాత్రమే. ఆమె విలీనం చర్చల గురించి బయటకు చెప్పకుండా ఉంటే..  కనీసం తాను పోటీ చేయాలనుకున్న నియోజకవర్గంలో అయినా బలంగా ఉండేవారన్న అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేదు. ఏపీలో రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా మేలు జరుగుతుందని చెప్పుకున్నారు. షర్మిల కూడా ఆసక్తి చూపించారని కానీ..  చివరి క్షణంలో హైకమాండ్ హ్యాండిచ్చిందని చెబుతున్నారు. 
 
కాంగ్రెస్ హైకమాండ్ షర్మిల అవసరం లేదని భావిస్తోందా ?

షర్మిలతో వ్యవహరిస్తున్న  విధానం చూస్తే కాంగ్రెస్ హైకమాండ్.. ఇక షర్మిలతో పని లేదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆమె వల్ల ఉపయోగంలేదని అనుకుంటున్నారు.  పార్టీని విలీనం చేయడం వరకూ ఓకే కానీ.. ఎక్కడ బాధ్యతలివ్వాలి.. ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది తమకు వదిలేయాలని హైకమాండ్ సూచించే అవకాశం ఉంది. ఈ నిబంధనకు షర్మిల ఒప్పుకుంటారో లేదో కానీ.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల వరకూ చూస్తే.. షర్మిల తెలంగాణ రాజకీయాలకూ దూరమవుతున్నట్లుగానే ఉందన్న వాదన వినిపిస్తోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: స్టాలిన్ కన్నా ఉదయనిధి షో ఎక్కువ - ఈ ఎన్నికలతోనే డీఎంకే తదుపరి వారసత్వం ఖరారవుతుందా?
స్టాలిన్ కన్నా ఉదయనిధి షో ఎక్కువ - ఈ ఎన్నికలతోనే డీఎంకే తదుపరి వారసత్వం ఖరారవుతుందా?
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Ippasara Anirudh Reddy: ఇప్పసారా రాజకీయం - అనిరుధ్ రెడ్డి హెల్తీ ప్రచారం వెనుక అసలు వ్యూహమేంటి?
ఇప్పసారా రాజకీయం - అనిరుధ్ రెడ్డి హెల్తీ ప్రచారం వెనుక అసలు వ్యూహమేంటి?
YSRCP Amaravathi: రాజధాని విషయంలో తేల్చుకోలేకపోతున్న వైఎస్ఆర్‌సీపీ - ఓ విధానం లేకుండా ప్రజలకేం చెబుతారు?
రాజధాని విషయంలో తేల్చుకోలేకపోతున్న వైఎస్ఆర్‌సీపీ - ఓ విధానం లేకుండా ప్రజలకేం చెబుతారు?

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Rules From 1 April 2026: ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
Property Rights: భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
YSRCP Supports Amaravati Bill: అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget