అన్వేషించండి

Women Reservation Bill: ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్లదే వ్యూహం - బీజేపీ 'ఓటమి' వెనుక దాగున్న భారీ ప్లాన్ అదేనా?

BJP: రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోతుందనితెలిసి కూడా బీజేపీ ఎందుకు ముందుకు వెళ్లింది? బీజేపీ తదుపరి యాక్షన్ ప్లానే దానికి సమాధానం చెప్పనుంది.

grand plan hidden behind the BJP defeat : రాజకీయాల్లో ఎప్పుడు ముందుకు వెళ్లాలో, ఎప్పుడు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గాలో తెలిసిన వాళ్లే అసలైన చాణక్యులు. తాజా పార్లమెంట్ పరిణామాలు గమనిస్తే, బీజేపీ రాజ్యాంగసవరణ బిల్లు ఓడిపోతుందని తెలిసి కూడా ఎందుకు ఓటింగ్‌కు వెళ్లిందనే అంశంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇది కేవలం ఒక బిల్లు ఓటమి కాదు, ఇండీ కూటమి కోసం వేసిన ఒక భారీ రాజకీయ ఉచ్చుగా  భావిస్తున్నారు.  

 తెలిసే వేసిన ఎత్తుగడ 

లోక్‌సభలో రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ తమకు లేదని ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ముందే తెలుసు. నిజంగా ఈ బిల్లును నెగ్గించుకోవడమే లక్ష్యమైతే, గతంలో ఆర్టికల్ 370 లేదా ఇతర కీలక బిల్లుల సమయంలో చేసినట్లుగా తెరవెనుక మంత్రాంగాలు నడిపి, ఇతర పార్టీల మద్దతు కూడగట్టేవారు. కానీ, ఈ సారి ప్రభుత్వం కేవలం సభా వేదికగా  విజ్ఞప్తి  చేయడానికే పరిమితమైంది. అంటే, ఈ బిల్లు నెగ్గడం కంటే, అది వీగిపోవడం ద్వారా వచ్చే రాజకీయ మైలేజీపైనే బీజేపీ కన్నేసినట్లు కనిపిస్తోంది.

 డీలిమిటేషన్ - ఒక రాజకీయ ఆయుధం 

మహిళా రిజర్వేషన్ బిల్లును విడిగా పెట్టి ఉంటే ప్రతిపక్షాలు దాన్ని కాదనలేక ఏకగ్రీవంగా ఆమోదించేవి. కానీ, కావాలనే దానికి  నియోజకవర్గాల పునర్విభజన   అనే వివాదాస్పద అంశాన్ని ప్రభుత్వం ముడిపెట్టింది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న భయంతో విపక్ష కూటమి అడ్డుకుంటుందని బీజేపీకి పక్కా అంచనా ఉంది. మహిళా సాధికారత అనే ముసుగులో డీలిమిటేషన్ అజెండాను ముందుకు తీసుకురావడం, తద్వారా విపక్షాలను ఇరకాటంలో పెట్టడం ప్రభుత్వ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.

50 శాతం రిజర్వేషన్ సవాల్ 

చర్చ సందర్భంగా అమిత్ షా చేసిన సవాల్‌కు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. డీలిమిటేష్న బిల్లులో   50 శాతం పెంపు ఉండేలా మార్పు చేస్తే తాము మద్దతిస్తామని ప్రకటించారు. నిజానికి ప్రభుత్వం ఆ మార్పు చేసి ఉంటే విపక్షాల నోళ్లు మూతపడేవి. కానీ, అమిత్ షా ఆ ప్రతిపాదనను స్వీకరించకుండా నేరుగా ఓటింగ్‌కు వెళ్లారు. అంటే, బిల్లులో మార్పులు చేసి దాన్ని ఆమోదించుకోవడం కంటే, ప్రస్తుత రూపంలోనే అది వీగిపోవాలని ప్రభుత్వం కోరుకున్నట్లు స్పష్టమవుతోంది.

 మహిళా ఓటు బ్యాంకుపై కన్ను 

ఈ ఓటమిని ఆయుధంగా చేసుకుని, దేశంలోని మహిళలందరినీ కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకం చేసే కార్యచరణను బీజేపీ ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం.  మేము మీకు 33% అధికారం ఇవ్వాలని చారిత్రక బిల్లు తెస్తే, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అడ్డుకున్నాయి  అనే నినాదంతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. మహిళా ఓటర్ల మనోభావాలను దెబ్బతీయడం ద్వారా విపక్ష కూటమిని మహిళా వ్యతిరేక  శక్తులుగా చిత్రించడం ఈ వ్యూహంలోని అసలు తిరుగులేని అంశం.

 విపక్షాలకు పెను సవాల్ 

ఇప్పుడు ఈ వ్యూహాన్ని తిప్పికొట్టడం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా  కూటమికి కత్తి మీద సాము లాంటిదే. తాము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, కేవలం డీలిమిటేషన్ ప్రక్రియలో ఉన్న లోపాలను మాత్రమే వ్యతిరేకించామని మహిళలకు వివరించడానికి విపక్షాలు నానా తంటాలు పడాల్సి ఉంటుంది. సంక్లిష్టమైన రాజ్యాంగ అంశాలను సామాన్య మహిళా ఓటర్లకు అర్థమయ్యేలా చెప్పడంలో విపక్షాలు విఫలమైతే, బీజేపీ ఆశించినట్లుగా అది భారీ ఓటు బ్యాంకుగా మారే ప్రమాదం ఉంది. ఈ ఓటమి బీజేపీకి ఒక రకమైన  వ్యూహాత్మక వెనకడుగు . బిల్లు వీగిపోవడం వల్ల సాంకేతికంగా ప్రభుత్వం నష్టపోయినట్లు కనిపించినా, రాజకీయంగా మాత్రం ఒక బలమైన ప్రచార అస్త్రాన్ని సంపాదించుకుంది.   అత్యవసర క్యాబినెట్ భేటీలో కూడా దీనికి కొనసాగింపుగా ఏదైనా సంచలన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget