అన్వేషించండి

Potholes on roads in AP: ఏపీ ప్రభుత్వానివన్నీ ప్రకటనలేనా - గుంతల్లేని రోడ్ల హామీ పూర్తయ్యేది ఎప్పటికీ ?

Mission Pothole-Free Roads: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఆర్భాటంగా ప్రారంభమైన గుంతల రహిత రోడ్ల మిషన్ ప్రచార ఆర్భాటంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మెరుగుపడలేదు.

Andhra Mission Pothole-Free Roads Fails: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఆర్భాటంగా ప్రారంభమైన  గుంతల రహిత రోడ్ల మిషన్  ప్రస్తుతం తీవ్ర విమర్శల పాలవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దుస్థితిని చక్కదిద్దుతామని, సంక్రాంతి 2026 నాటికి ఒక్క గుంత కూడా లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ గడువు ముగిసి నెలలు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. దాదాపు 10,880 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతుల కోసం రూ. 2,500 కోట్లకు పైగా కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించినా, ఆచరణలో అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి.

విఫలమైన సంక్రాంతి డెడ్ లైన్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి పలుమార్లు సమీక్షలు నిర్వహించి జనవరి 10, 2026 నాటికి పనులు పూర్తి కావాలని డెడ్ లైన్ విధించారు. అయితే, ఆ గడువు ముగిసినా చాలా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయంగానే ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేదని అంటున్నారు.  రోడ్ల మరమ్మతులు సాగకపోవడానికి ప్రధాన కారణం పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో జాప్యమని తెలుస్తోంది. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త పనులు చేపడతామని కాంట్రాక్టర్లు భీష్మించుకు కూర్చోవడం ప్రభుత్వానికి పెద్ద చిక్కుగా మారింది. మంత్రి జనార్ధన్ రెడ్డి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇస్తున్నప్పటికీ, ఆర్థిక శాఖ నుంచి నిధుల విడుదల ఆలస్యం కావడం పనులపై ప్రభావం చూపుతోంది. 

అధ్వాన్నంగా గ్రామీణ రోడ్లు

జాతీయ రహదారులు,  రాష్ట్ర రహదారుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా, మేజర్ జిల్లా రోడ్లు ,  గ్రామీణ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ప్రజలు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు.  పల్లెటూళ్ల నుంచి మండల కేంద్రాలకు వచ్చే రోడ్లు గుంతలమయమై ఉండటంతో అత్యవసర సమయాల్లో అంబులెన్సులు కూడా మెల్లగా వెళ్లాల్సి వస్తోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోడ్లు పాడయ్యాయని చెప్తున్న కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా వాటిని బాగు చేయకపోవడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ కొత్త ప్లాన్ - రూ. 7 వేల కోట్లతో మళ్లీ హామీలు

ప్రస్తుత విమర్శలతో  ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చి, ఇప్పుడు రూ. 7,000 కోట్లతో రాష్ట్రవ్యాప్త రోడ్ల పునరుద్ధరణ చేపడతామని కొత్త లక్ష్యాలను ప్రకటిస్తోంది. రాబోయే 6 నుండి 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామని మంత్రి తాజాగా పేర్కొన్నారు. అయితే, పాత డెడ్ లైన్లు విఫలమైన తరుణంలో ఈ కొత్త హామీలను ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది అనుమానమే. పనులు ఎప్పుడు మొదలవుతాయో చెప్పకుండా కేవలం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 గుంతల రహిత రోడ్లు  పథకం ప్రభుత్వ ప్రతిష్టకు సవాల్‌గా మారింది. ప్రకటనల్లో ఉన్న వేగం పనుల్లో లేకపోవడం, నిధుల కొరత,  కాంట్రాక్టర్ల అసహకారం వెరసి సామాన్య ప్రజలు ఇప్పటికీ గుంతల రోడ్లపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా మాటలు కట్టిపెట్టి, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget