అన్వేషించండి

Pithapuram Flexi controversy: పిఠాపురం కూటమిలో ఫ్లెక్సీ సెగ - వర్మ వర్సెస్ దొరబాబు.. తోపులాటతో ఉద్రిక్తత

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ కూటమి రాజకీయాల్లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. అధికారిక కార్యక్రమంలో ఫ్లెక్సీల వివాదం కాస్తా మాజీ ఎమ్మెల్యేల మధ్య తోపులాటకు దారి తీసింది.

Varma vs Dorababu in Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు వర్గాల మధ్య  తోపులాట చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ కూటమి రాజకీయాల్లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఫ్లెక్సీల వివాదం కాస్తా మాజీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట వరకు వెళ్లడం నియోజకవర్గంలో కలకలం రేపింది. మంగళవారం పాడా (PADA) కార్యాలయంలో మహిళా సంఘాలకు చెక్కులు, సెల్ ఫోన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇరువర్గాల ఘర్షణతో రసాభాసగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో మిత్రపక్షాల మధ్య ఈ స్థాయి గొడవ జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

 చంద్రబాబు ఫోటో ఎక్కడ? 

కార్యక్రమం ప్రారంభం కాగానే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఫ్లెక్సీ విషయంలో అధికారులను  నిలదీయడంతో వివాదం మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన పాడా పీడీని ప్రశ్నించారు. అధికారులు వివరణ ఇస్తుండగా, ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జోక్యం చేసుకున్నారు. ఫోటో పెట్టారని, ప్రతి చిన్న విషయానికి వివాదం చేయడం సరికాదని దొరబాబు అనడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో దొరబాబు వర్మపైకి దూసుకురావడంతో ఉద్రిక్తత పెరిగింది.

 కార్యకర్తల మధ్య పెనుగులాట 

నేతల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా జనసేన - టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాటకు దారితీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు విరుచుకుపడటంతో పోలీసులు, ఇతర నాయకులు రంగప్రవేశం చేసి వారిని విడదీశారు. తీవ్ర మనస్తాపానికి గురైన వర్మ అక్కడి నుండి తన కారులో వెనుదిరిగారు. వర్మ కావాలనే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని, కూటమి స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తుండగా.. అధికారులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని టీడీపీ వర్గం మండిపడుతోంది.

 దాడుల సంస్కృతిపై టీడీపీ ఆగ్రహం 

ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంపై వివరణ కోరితే దాడికి యత్నించడం దారుణమని టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులు తమ తప్పు ఒప్పుకున్నా, పెండెం దొరబాబు అనవసరంగా కలుగజేసుకుని వర్మపై భౌతిక దాడికి దిగడం అప్రజాస్వామికమని వారు ఆరోపించారు. పార్టీ మారినా దొరబాబులో పాత అలవాట్లు పోలేదని, కూటమిలో ఉంటూనే మిత్రపక్ష నేతలపై దురుసుగా ప్రవర్తించడంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనతో పిఠాపురం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

 ముదిరిన ఆధిపత్య పోరు 

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం వర్మ తన సీటును త్యాగం చేసినప్పటి నుండి, నియోజకవర్గంలో ఆధిపత్యం ఎవరిది అనే అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు పెండెం దొరబాబు జనసేనలో చేరడం, అధికారిక ప్రోటోకాల్ విషయంలో వర్మను పక్కన పెడుతున్నారనే భావన టీడీపీ క్యాడర్‌లో బలంగా ఉంది. ఈ ఫ్లెక్సీ వివాదం కేవలం నిమిత్తం మాత్రమేనని, లోలోపల ఉన్న ఆధిపత్య పోరు ఈ రూపంలో బయటపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదం ఇలాగే కొనసాగితే కూటమి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.    

టాప్ హెడ్ లైన్స్

Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget