అన్వేషించండి

Chandrababu In Chennai: నచ్చకున్నా మోదీనే ప్రధాని..! పీఎం హిందీకి తమిళనాడులో క్రేజ్ - చెన్నైలో చంద్రబాబు

త్రిభాషా సూత్రానికి తాను మద్ధతిస్తానని, తమిళనాడులో మార్పు వస్తోందని పీఎం మోదీ హిందీ ప్రసంగాలను తమిళ ప్రజలు ఎక్కువగా చూస్తున్నారని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చెన్నై: భారత ప్రధాని నరేంద్ర మోదీ హిందీ స్పీచ్‌లను తమిళనాడు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రిభాషా సూత్రానికి ఆంధ్రప్రదేశ్ మద్దతు తెలుపుతోందని, ప్రపంచ స్థాయిలో విజయం సాధించానికి అధిక భాషలు రావాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడు ప్రజలపై హిందీని ఎవరూ రుద్దడం లేదన్నారు. మీకు నచ్చినా, నచ్చకపోయినా వచ్చే ఎన్నికల్లో, ఆ తరువాత ఎన్నికల్లోనూ మోదీనే భారత ప్రధాని అని కితాబిచ్చారు.

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. త్రిభాషా సూత్రానికి తన మద్దతు ప్రకటించారు. పలు భాషలు నేర్చుకోవడంతో అంతర్జాతీయంగా అవకాశాలు ఉంటాయన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఫుడ్, సాంస్కృతిక వైవిధ్యం, జీవన విధానం ఉంటాయని వాటిని గౌరవించాలని సూచించారు. గతంలో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల మధ్య పోటీ ఉండేదని.. ఈసారి హిందీ భాష పై రాద్ధాంతం జరుగుతుందన్న విషయంపై చంద్రబాబు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ హిందీని తప్పనిసరి చేయాలని లేదా జాతీయ భాషగా రుద్దలేదని, ప్రజలు స్వచ్ఛందంగానే నేర్చుకుంటున్నారని స్పష్టం చేశారు. 

Chandrababu In Chennai: నచ్చకున్నా మోదీనే ప్రధాని..! పీఎం హిందీకి తమిళనాడులో క్రేజ్ - చెన్నైలో చంద్రబాబు
ప్రధాని మోదీ హిందీ స్పీచ్‌లకు తమిళనాడులో క్రేజ్ 
ఏపీ ప్రభుత్వం త్రిభాషా సూత్రానికి సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. మాతృభాష తెలుగుతో పాటు ఇతర భాషలకు ప్రాధాన్యం కల్పిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ హిందీలో చేసే ప్రసంగాలను ఇప్పుడు తమిళనాడులో ఎక్కువగా చూస్తున్నారు. ఇంగ్లీష్ ముఖ్యమే అయినప్పటికీ, తెలుగు వంటి మాతృ, ప్రాంతీయ భాషలను రక్షించుకోవాలి. తమిళులతో సహా ప్రజలు వివిధ ప్రాంతాలకు, దేశాలకు వెళ్తున్నప్పుడు క్రమంగా ఒకటి కంటే ఎక్కువ భాషలను నేర్చుకుంటున్నారు. అధిక భాషలు నేర్చుకుంటే మనకు ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయి. అవకాశాలను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలలో జర్మన్, జపనీస్, ఫ్రెంచ్ వంటి అంతర్జాతీయ భాషలను ప్రోత్సహిస్తున్నాం. ప్రపంచీకరణ చెందుతున్న నేటి ప్రపంచంలో ఎక్కువ భాషలు తెలిసి ఉండటం వల్ల పోటీతత్వలో మీకు ప్రయోజనం కలుగుతుంది. 

Chandrababu In Chennai: నచ్చకున్నా మోదీనే ప్రధాని..! పీఎం హిందీకి తమిళనాడులో క్రేజ్ - చెన్నైలో చంద్రబాబు

ఇప్పుడు ఉన్నది ఒకటే ఇజం టూరిజం..

‘ప్రపంచం ఒక గ్లోబల్ మార్కెట్‌గా మారింది. పాత ఆలోచనలు, సంకుచిత మనస్తత్వం నుంచి బయటకు రావాలి. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా ఉందని, భవిష్యత్ ఎన్నికలలో కూడా ఆయన అధికారంలోకి వస్తారు. మీకు ఇష్టం ఉన్నా, లేకున్నా ఆయనే విజయాలు సాధించి ప్రధానిగా కొనసాగుతారు. అభివృద్ధికి మార్పులకు అనుగుణంగా మారాలి. విశాల దృక్పథంతో ఆలోచించాలి. పెట్టుబడిదారీ విధానం, సోషలిజం, కమ్యూనిజం వంటి సాంప్రదాయ భావజాల విభజనలు క్రమంగా ప్రాముఖ్యతను కోల్పోయాయి. ప్రస్తుతం కేవలం టూరిజం మాత్రమే ప్రాధాన్యత కలిగిన రంగమని’ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Chandrababu In Chennai: నచ్చకున్నా మోదీనే ప్రధాని..! పీఎం హిందీకి తమిళనాడులో క్రేజ్ - చెన్నైలో చంద్రబాబు

భారత్‌లో వైవిధ్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనియాడుతూ.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంప్రదాయం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెసరట్టు, పొంగల్, హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. చెన్నైకి వచ్చినప్పుడు నేను ఇడ్లీ సాంబార్ ఇష్టంగా తింటానని తెలిపారు. విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలే దేశానికి బలమని పేర్కొన్నారు. ఈ వైవిధ్యమే ప్రపంచ పర్యాటకానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని... అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. కానీ భాషలపై వ్యతిరేకత, ప్రాంతాలపై వ్యతిరేకత లాంటివి మానుకోవాలని చంద్రబాబు సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget