అన్వేషించండి

Kadapa Crime News: యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం

యువతి విషయమై చంపుతానని బెదిరించాడనే కక్షతో వెంకటేశ్వర్లు అనే యువకుడిని ఇద్దరు మైనర్లు బైక్ రాడ్, రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. కడప జిల్లా మైదుకూరులో ఈ దారుణం జరిగింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కడప జిల్లాలో యువతి విషయంలో గొడవతో యువకుడు హత్యకు గురయ్యాడు.
  • స్నేహితురాలి విషయంలో బెదిరించాడని ఇద్దరు మైనర్లు హత్యకు ప్లాన్ చేశారు.
  • బైక్ రాడ్డు, రాయితో కొట్టి హత్య చేయగా, మైనర్లను అరెస్టు చేశారు.

మైదుకూరు:  యువతి విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఏకంగా ఓ యువకుడి హత్యకు దారి తీసింది. తనను చంపుతానని బెదిరించాడనే కోపంతో ఇద్దరు మైనర్లు కలిసి ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం బోంచేనుపల్లె సమీపంలో ఘోరం జరిగింది. ఈ సంఘటన జులై 22న జరగ్గా, ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ కె.రమణారెడ్డి మంగళవారం వెల్లడించారు.

యువతి విషయంలో గొడవ.. బాలుడికి లవర్ వార్నింగ్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోంచేనుపల్లెకు చెందిన వెంకటేశ్వర్లు (19) అనే యువకుడు మైదుకూరు ప్రాంతానికి చెందిన ఓ యువతితో రిలేషన్‌లో ఉన్నాడు. వెంకటేశ్వర్లు ద్వారా అతడి స్నేహితుడైన ఓ మైనర్‌కు ఆ యువతి పరిచయమైంది. దాంతో ఆ బాలుడు కూడా ఆమెతో చనువుగా ఉండటం, తరచుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారం నచ్చని వెంకటేశ్వర్లు, ఆ యువతితో ఇకపై మాట్లాడితే చంపేస్తానని స్నేహితుడైన మైనర్ యువకుడ్ని బెదిరించాడు.

వార్నింగ్ ఇచ్చాడని యువకుడి హత్యకు ప్లాన్

ఈ బెదిరింపులతో ఆందోళనకు గురైన ఆ బాలుడు తన పెద్దనాన్న కుమారుడికి (అతడు కూడా మైనరే) తెలిపాడు. వెంకటేశ్వర్లు తనకు ప్రమాదకరంగా మారాడని, హత్య చేస్తానని సైతం బెదిరించాడని సోదరుడితో చర్చించాడు. ఎప్పుడైనా వెంకటేశ్వర్లు నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉంటుందని భావించిన మైనర్, తన సోదరుడితో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేశాడు.

Also Read: Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు

ఈ క్రమంలో జులై 22న వెంకటేశ్వర్లును బోంచేనుపల్లె సమీపంలోని కాలనీ వద్దకు రావాలని ఆ బాలుడు పిలిచాడు. అతడు అలా వచ్చి రాగానే బైక్ రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో వెంకటేశ్వర్లు కింద పడిపోయి నొప్పితో గిలగిలా కొట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు కోలుకునేందుకు సమయం ఇవ్వకుండా మైనర్ బాలురు ఇద్దరూ కలిసి పెద్ద రాయితో మోది దారుణంగా హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులైన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని కడపలోని బాలల న్యాయమండలి (జూవైనల్ బోర్డు) ముందు ప్రవేశపెట్టినట్లు సీఐ రమణారెడ్డి తెలిపారు.

Frequently Asked Questions

మైదుకూరులో యువకుడి హత్యకు ప్రధాన కారణం ఏమిటి?

యువతి విషయంలో తలెత్తిన వివాదం కారణంగా వెంకటేశ్వర్లు ఓ మైనర్‌ను బెదిరించాడు. ఈ బెదిరింపుల కారణంగా మైనర్‌లు వెంకటేశ్వర్లును హత్య చేశారు.

హత్యకు గురైన యువకుడు ఎవరు?

హత్యకు గురైన యువకుడి పేరు వెంకటేశ్వర్లు (19). ఇతను బోంచేనుపల్లెకు చెందినవాడు.

ఈ హత్య ఎప్పుడు, ఎక్కడ జరిగింది?

ఈ సంఘటన జులై 22న వైఎస్సార్ కడప జిల్లాలోని మైదుకూరు మండలం బోంచేనుపల్లె సమీపంలో జరిగింది.

నిందితులు ఎవరు? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

ఇద్దరు మైనర్లు ఈ హత్యకు పాల్పడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బాలల న్యాయమండలి ముందు ప్రవేశపెట్టారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget