News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

BRS Maharastra : ఒక్క మహారాష్ట్ర అదీ ఓ ప్రత్యేక ప్రాంతంపైనే కేసీఆర్ దృష్టి - బీఆర్ఎస్ రాజకీయంలో లాజిక్కేంటి ?

బీఆర్ఎస్ మహారాష్ట్ర రాజకీయం వెనుక లాజిక్కేంటి ?

ఎన్సీపీని బలహీనం చేయడమే టాస్క్ గా పెట్టుకున్నారా ?

తెలంగాణ ప్రజల్లో వస్తున్న సందేహాలకు ఎలా సమాధానం ఇస్తారు ?

FOLLOW US: 
Share:

BRS Maharastra :   తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తర్వాత కేసీఆర్ వేరే ఏ రాష్ట్రంలోనూ పర్యటించలేదు..ఒక్క మహారాష్ట్రలో తప్ప. పదే పదే మహారాష్ట్రకు వెళ్తున్నారు. నాగపూర్ లో ఆఫీసు కూడా ప్రారంభించారు. ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి తాను కూడా స్వయంగా వెళ్లారు. ఏపీలో ఆఫీసు ప్రారంభోత్సవానికి కనీసం పార్టీ ప్రతినిధిని కూడా పంపలేదు. కేసీఆర్ మహారాష్ట్రపై ఇంత గరి పెట్టడానికి కారణం ఏమిటి అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. 

తెలంగాణ కన్నా ఎక్కువగా మహారాష్ట్రకు ప్రయారిటీ ఇస్తున్నారా ? 
 
కేసీఆర్ తెలంగాణలో రెండు రోజుల పాటు పాలనను పక్కన పెట్టి మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఇటీవలి కాలంలో ఆయన దాదాపుగా ప్రతి పది రోజులకు ఓ సారి మహారాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు. అది కూడా పూర్తిగా మహారాష్ట్రలోని ఓ ప్రాంతానికే వెళ్తున్నారు. తెలంగాణతో సరిహద్దు ఉన్న ప్రాంతం.. విదర్భ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇక్కడ బలమైన పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. అంటే శరద్ పవార్ పార్టీ. ఈ పార్టీని బలహీనం చేసి తన పార్టీని బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఇలా పర్యటనలు .. రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ఎస్‌లో చేరేందుకు అత్యధికంగా వస్తున్న నేతలు కూడా ఎన్సీపీకి చెందినవారే. కేసీఆర్ మరే రాష్ట్రంలోనూ ఈ విధంగా రాజకీయాలపై దృష్టి పెట్టలేదు.  కర్ణాటకలో కనీసం ప్రచారం చేయలేదు. రాష్ట్ర అధ్యక్షుల్ని ప్రకటించిన బీఆర్ఎస్, ఏపీల గురించి ఒక్క ఆలోచన చేయడం లేదు. కానీ మహారాష్ట్రపై మాత్రం తన ఎఫర్ట్ అంతా పెడుతున్నారు. 

శరద్ పవార్ పార్టీని బలహీనం చేసి బీఆర్ఎస్‌ను బలోపేతం చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారా ?
 
మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ, శివసేన ప్రభుత్వం ఉంది.ఈ శివసేన వర్జినల్ కాదు. చీలిక వర్గానికి అసలైన శివసేనగా గుర్తించడంతో శివసేన అయింది.   వచ్చే ఎన్నికల్లో  కాంగ్రెస్, ఉద్దవ్ శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయడం ఖాయం. అధికారం నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు బీజేపీ ముందున్న టాస్క్ శివసేన,  ఎన్సీపీలను బలహీనం చేయడం. శివసేన విషయంలో ఇప్పటికే చాలా వరకూ బీజేపీ సక్సెస్ అయింది.  దాదాపుగా నేతలందర్నీ తిరుగుబాటు గూటికి చేర్చారు. ఎలా చూసినా వచ్చే ఎన్నికల్లో  షిండే దగ్గర ఉన్న శివసేన అసలు గుర్తుకు.. థాక్రే వర్గం గుర్తుకు మధ్య క్లాష్ ఉంటుంది. ఇప్పుడు ఎన్సీపీని బలహీనం చేయాలని బీజేపీ అనుకుంది. గతంలో తమతో చేతులు కలపడానికి సిద్ధమైన అజిత్ పవార్ ను మొదట చేరదీశారు. కానీ అది వర్కవుట్ కాలేదు. అదే సమయంలో  కేసీఆర్ ను రంగంలోకి దిగారు.  

తెలంగాణలో కేసీఆర్ ఇబ్బంది పడతారా ? 

కేసీఆర్ అంటే తెలంగాణ నేత.  తాను తెలంగాణకు అంకితమన్నట్లుగా ఉద్యమాన్ని నడిపించారు కేసీఆర్. ఇప్పుడు తాను చేయాల్సినదంతా  అయిపోయిందని తాను ఇక మహారాష్ట్ర వెళ్లి రాజకీయాలు చేస్తానన్నట్లుగా కేసీఆర్ తీరు ఉంది. తెలంగాణ కంటే మహారాష్ట్రపైనే ఎక్కువ దృష్టి పెట్టారని సహజంగానే ప్రజల్లో చర్చ జరుగుతోంది.   తెలంగాణలో ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయాల కోసం పరుగులు పెడుతున్నారు. ఆయన ఇలా చేయడం వెనుక బీజేపీ ఉందని ఎస్పీ ఆరోపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. జరుగుతున్న పరిణామాలు మాత్రం అలాగే ఉన్నాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 27 Jun 2023 08:00 AM (IST) Tags: BRS KCR Telangana Politics BRS Maharashtra politics

ఇవి కూడా చూడండి

Telangana Elections 2023 : ఫుల్ స్వింగ్‌లో బెట్టింగ్ బంగార్రాజులు - సొంత సర్వేలతో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పందేలు !

Telangana Elections 2023 : ఫుల్ స్వింగ్‌లో బెట్టింగ్ బంగార్రాజులు - సొంత సర్వేలతో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పందేలు !

Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!

Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!

Telangana Elections 2023 : ప్రలోభాల్లో ఎవరూ తగ్గట్లే - కొన్ని డబ్బులు డిమాండ్ చే్సతున్న ఓటర్లు !

Telangana Elections 2023 : ప్రలోభాల్లో ఎవరూ తగ్గట్లే - కొన్ని డబ్బులు డిమాండ్ చే్సతున్న ఓటర్లు !

Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !

Telangana Elections 2023 :  దేవుడి మీదే భారం  - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు  !

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

టాప్ స్టోరీస్

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!