అన్వేషించండి

Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?

NEET Paper Leak Accountability: కేంద్ర కేబినెట్ విస్తరణ ఏ క్షణమైనా జరిగే అవకాశం ఉంది. అందరి దృష్టి ధర్మేంద్ర ప్రధాన్ వైపే ఉంది. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా జెన్ జీ ఉద్యమం చేస్తోంది.

Dharmendra Pradhan Ouster Education Ministry:  దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర రాజకీయాల్లో మరోసారి భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే  ప్రభుత్వం, త్వరలోనే చేపట్టబోయే కేంద్ర కేబినెట్ విస్తరణ  పై కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ విస్తరణలో భాగంగా పలువురు సీనియర్ మంత్రుల పోర్ట్‌ఫోలియోలు మారడమే కాకుండా, వివాదాల్లో చిక్కుకున్న కొందరు కీలక నేతలకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో అందరికంటే ముందుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని జెన్‌జీ ఉద్యమం 

ఈ పొలిటికల్ ప్రక్షాళనకు ప్రధాన కారణం.. గడిచిన కాలంలో దేశవ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని, యువతను తీవ్ర కుదిపేసిన నీట్ , సీబీఎస్ఈ , యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణలో దొర్లిన అవకతవకలు, పేపర్ లీకేజీల వివాదాలే. దేశంలో అత్యున్నత విద్యా ప్రమాణాలు, పారదర్శకతను కాపాడటంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  వైఫల్యం నేరుగా విద్యా మంత్రిత్వ శాఖ పనితీరుపై మచ్చ తెచ్చింది. విపక్షాలు   ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ ఎంతగా యాగీ చేసినా, క్షేత్రస్థాయిలో యువత ,  నిరుద్యోగుల నుంచి వ్యక్తమైన తీవ్ర అసంతృప్తిని చల్లార్చడం మోదీ ప్రభుత్వానికి అత్యంత అవసరంగా మారింది.

యువత ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చే మోదీ 

 నరేంద్ర మోదీ ఎప్పుడూ కూడా యువత ఆలోచనలను, వారి సెంటిమెంట్లను చాలా నిశితంగా గమనిస్తారు. విపక్షాల నిరసనలు, పొలిటికల్ డ్రామాలను ఆయన పెద్దగా లెక్కచేయకపోయినప్పటికీ, దేశ భవిష్యత్తు అయిన యువతలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాకుండా చూసుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షల వివాదంలో.. ప్రజలకు జవాబుదారీతనం చూపించాల్సిన అవసరం ఉందని మోదీ గట్టిగా నమ్ముతున్నారు. వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు బాధ్యులైన వారిపై  రాజకీయ చర్యలు  తీసుకోవడం ద్వారానే ప్రజల్లో ప్రభుత్వ విశ్వసనీయత పెరుగుతుందనేది మోదీ మార్క్ వ్యూహం. సోషల్ మీడియా  లో సైతం ధర్మేంద్ర ప్రధాన్ మార్పుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎన్‌టీఏ   వైఫల్యాలు, నిరంతర పేపర్ లీకేజీల వార్తలపై విద్యార్థి సంఘాలు, నెటిజన్లు విద్యాశాఖ మంత్రిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, యువ ఓటర్లలో సానుకూల సంకేతాలు పంపడానికి మోదీ ఈ కఠిన నిర్ణయానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ నుంచి తప్పించి, మరొక సమర్థుడైన నేతకు ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామనే గట్టి నమ్మకాన్ని యువతకు కల్పించాలనేది అధిష్ఠానం ఆలోచన.

వేరే శాఖ ఇస్తారా? పూర్తిగా తొలగిస్తారా? 

ధర్మేంద్ర ప్రధాన్‌ను కేబినెట్ నుంచి పూర్తిగా పక్కన పెడతారా లేదా ఆయనను కేవలం విద్యాశాఖ నుంచి మార్చి తక్కువ ప్రాధాన్యత ఉన్న మరో పోర్ట్‌ఫోలియోకు పరిమితం చేస్తారా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఒడిశా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న ఆయనను పూర్తిగా దూరం పెట్టడం కూడా అంత సులువు కాదు. కానీ, ప్రధాని మోదీ గత పదేళ్ల ట్రాక్ రికార్డ్‌ను పరిశీలిస్తే.. లీకేజీలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాల లాంటి సున్నితమైన అంశాలలో రాజీపడే ప్రసక్తే ఉండదు. కాబట్టి, రాబోయే కేబినెట్ విస్తరణలో విద్యాశాఖకు కొత్త బాస్ రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ కేబినెట్ విస్తరణ కేవలం మంత్రుల మార్పు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకునే ప్రక్రియగా నిలవబోతోంది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ, నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు భరోసా ఇచ్చేలా నూతన కేబినెట్ కూర్పు ఉండబోతోందని స్పష్టమవుతోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Telangana Politics: రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget