అన్వేషించండి

NEET 2026 Paper Leak: నీట్, సీబీఎస్ఈ వివాదాలతో కేంద్రంపై యువతలో వ్యతిరేకత - దేవేంద్ర ప్రధాన్ పదవికి ముప్పు?

CBSE Exam Reforms 2026: నీట్, సీబీఎస్ఈ వివాదాల వల్ల కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందా? మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి ముప్పు ఉందా? ప్రజా విశ్వాసాన్ని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది?

PM Modi Cabinet strategy: నీట్, సీబీఎస్ఈ వివాదాలు కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా విద్యాశాఖపై  ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి.  లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం కావడంతో, పేపర్ లీకేజీలు మరియు సాంకేతిక లోపాలు ప్రజల్లో అసహనానికి దారితీశాయి.  నీట్-యూజీ 2026 పరీక్ష రద్దు, సీబీఎస్ఈ మూల్యాంకనంలో దొర్లిన పొరపాట్లు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను కొంతమేర దెబ్బతీశాయి. విద్యా వ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సిన ఎన్‌టీఏ వంటి సంస్థల వైఫల్యంపై నిరుద్యోగ యువతలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనివల్ల ప్రభుత్వ  జీరో టాలరెన్స్  విధానంపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే, దీనిని కేవలం వైఫల్యంగానే కాకుండా, వ్యవస్థను ప్రక్షాళన చేసే అవకాశంగా ప్రభుత్వం భావిస్తోంది. సిబిఐ విచారణకు ఆదేశించడం, పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపడం ద్వారా పోగొట్టుకున్న విశ్వాసాన్ని మళ్ళీ పొందే ప్రయత్నం చేస్తోంది.

 ధర్మేంద్ర ప్రధాన్ పదవి ఉంటుందా? 

కేంద్ర మంత్రివర్గ విస్తరణ మరియు పునర్వ్యవస్థీకరణపై ఢిల్లీలో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. గత కొన్ని వారాలుగా చోటుచేసుకున్న వరుస వివాదాల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ఒత్తిడి పెరిగింది. ప్రధాని మోదీ సాధారణంగా పనితీరు ఆధారంగా  మంత్రులను విశ్లేషిస్తారు. విద్యాశాఖలో జరిగిన లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయనను మార్చే అవకాశం ఉందన్న చర్చ ఒకవైపు సాగుతుండగా, మరోవైపు వ్యవస్థను చక్కదిద్దే బాధ్యతను ఆయనకే అప్పగించి సంస్కరణలు పూర్తి చేయాలని ప్రధాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విస్తరణలో ఆయనకు మరో శాఖ కేటాయించే అవకాశం కూడా కొట్టిపారేయలేము.

 ప్రజా విశ్వాసాన్ని ఎలా సంపాదిస్తారు? 

ప్రజల నమ్మకాన్ని మళ్ళీ చూరగొనడానికి ప్రభుత్వం త్రీ-వే స్ట్రాటజీ ని అనుసరించబోతోంది పెన్-అండ్-పేపర్ విధానానికి స్వస్తి పలికి, నీట్ వంటి పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత   పరీక్షలుగా మార్చడం ద్వారా లీకేజీలకు చెక్ పెట్టడం. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన శిక్షలు, జరిమానాలు విధించేలా కొత్త చట్టాలను పటిష్టంగా అమలు చేయడం. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను వేగంగా అమలు చేయడం ద్వారా ఎన్‌టీఏ మరియు సీబీఎస్ఈ పనితీరులో పారదర్శకతను పెంచడం వంటి చర్యలు తీసుకోబోతోంది. 

 CBSEలో విప్లవాత్మక మార్పులు 

కేవలం పరీక్షలే కాకుండా, సీబీఎస్ఈ 2026 నుంచి కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ కు ప్రాధాన్యత ఇస్తోంది. బట్టీ పట్టే విధానం కాకుండా, విద్యార్థుల విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేలా 50% ప్రశ్నలను మార్చడం ద్వారా విద్యా నాణ్యతను పెంచాలని చూస్తోంది. డిజిటల్ మూల్యాంకనం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ మార్పులు సత్ఫలితాలను ఇస్తేనే ప్రభుత్వంపై ప్రజా విశ్వాసం పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు.  రాబోయే మంత్రివర్గ విస్తరణ కేవలం రాజకీయ అవసరాల కోసం కాకుండా, పాలనలో లోపాలను సరిదిద్దే దిశగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ పదవిలో మార్పు ఉంటుందా లేదా అనేది ప్రధాని మోదీ తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కానీ, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవడం మాత్రం కేంద్రానికి ఇప్పుడు అత్యంత కీలకం. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
TDP Janasena Social Media War: క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
YSRCP MLA Disqualification Issue: అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget