అన్వేషించండి

Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?

TVK Vijay: విజయ్ పార్టీ TVKలో కనిపిస్తున్న పేర్లన్నీ దాదాపు కొత్తవే. అనుభవం,ఆర్థిక స్థోమత లేని వారితో ఎన్నికల గండాన్ని ఎలా ఈదాలని విజయ్ సన్నిహితులు కిందా మీదా పడుతున్నారు.

TVK faces shortage of candidates in Tamil Nadu Assembly elections:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు  సమీపిస్తున్న తరుణంలో, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం  ఒక కీలకమైన సంధి దశలో ఉంది. పార్టీని ప్రకటించినప్పుడు కనిపించిన ఉత్సాహం, ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక , సీనియర్ నేతల చేరికల విషయంలో కొంత మందగించినట్లు కనిపిస్తోంది.  

TVKలో సీనియర్ల లేమి 

ఏదైనా కొత్త పార్టీ స్థాపించినప్పుడు ఇతర ప్రధాన పార్టీల నుండి అసంతృప్త నేతలు, మాజీ మంత్రులు భారీగా చేరుతుంటారు. కానీ, విజయ్ పార్టీ విషయంలో అది ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ప్రస్తుతం TVKలో కనిపిస్తున్న పేర్లన్నీ దాదాపు కొత్తవే . జేసీడీ ప్రభాకర్  AIADMK మాజీ ఎమ్మెల్యే  వంటి కొద్దిమంది మినహా, రాష్ట్రవ్యాప్త ప్రభావం ఉన్న బలమైన మాస్ లీడర్లు విజయ్ చెంత చేరకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటుగా పరిణమించింది. క్షేత్రస్థాయిలో ఓట్లను ప్రభావితం చేయగల ఆర్థిక బలం, అంగబలం ఉన్న నేతలు లేకపోవడం 234 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను సంక్లిష్టంగా మార్చింది.

 100 స్థానాల్లోనైనా గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు దొరకడం కష్టం

ప్రస్తుతం విజయ్ సొంతంగా నిర్వహించుకుంటున్న అంతర్గత సర్వేలు కూడా అభ్యర్థుల విషయంలో మిశ్రమ ఫలితాలను ఇస్తున్నట్లు సమాచారం. 234 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటిస్తున్నప్పటికీ, కనీసం 100 స్థానాల్లోనైనా గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు దొరకడం విజయ్‌కు సవాలుగా మారింది. ఈ జాప్యం వల్ల కేడర్‌లో కొంత అయోమయం నెలకొంది. అయితే, విజయ్ వ్యూహం మాత్రం భిన్నంగా ఉంది. పాత తరం రాజకీయ నేతల కంటే, కొత్త రక్తం , యువతకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. కానీ, ఎన్నికల రాజకీయం కేవలం గ్లామర్‌తో మాత్రమే సాగదు, దానికి బలమైన వ్యవస్థాగత నిర్మాణం అవసరమన్న అభిప్రాయం కూడా ఆ పార్టీలో ఉంది. 

సీట్లు దక్కని సీనియర్లు వస్తారా?

పొత్తుల  కారణంగా డిఎంకె (DMK), అన్నాడిఎంకె (AIADMK) కూటముల్లో సీట్ల సర్దుబాటు ముగిసిన తర్వాత, టికెట్ దక్కని అసంతృప్త నేతలే విజయ్‌కు ప్రధాన ఆశాకిరణం కానున్నారు. ముఖ్యంగా ఉత్తర,  మధ్య తమిళనాడులో సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని భావించే సీనియర్లు చివరకు టీవీకే వైపు చూసే అవకాశం ఉంది. అటువంటి  వలస  నేతలకు విజయ్ రెడ్ కార్పెట్ పరుస్తారా లేక తన సిద్ధాంతాలకు కట్టుబడి కొత్తవారికే ఛాన్స్ ఇస్తారా అన్నది ఆసక్తికరం. పొత్తుల బాధితులకు టికెట్లు ఇవ్వడం ద్వారా పార్టీకి తక్షణమే బలమైన అభ్యర్థులు దొరుకుతారు, కానీ అది పార్టీ మూల సిద్ధాంతాన్ని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది.   విజయ్ తన తొలి ఎన్నికల పోరాటాన్ని చెన్నైలోని  పెరంబూర్  నియోజకవర్గం నుండి ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే తిరుచ్చి ఈస్ట్ నుండి కూడా ఆయన పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పట్టణ ఓటర్లు, మహిళలు, యువతపైనే విజయ్ కొండంత ఆశలు పెట్టుకున్నారు.

 విజయ్ ముందున్నది ముళ్లబాటే. సీనియర్ నేతల కొరతను ఆయన తన చరిష్మాతో ఎంతవరకు అధిగమిస్తారనేది మే 4న వచ్చే ఫలితాలు తేలుస్తాయి. ప్రస్తుతం ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతల కోసం వేచి చూడటం కంటే, తనకున్న పరిమిత వనరులతోనే దూకుడు పెంచాల్సిన అవసరం టీవీకేకు ఉంది. అభ్యర్థుల తుది జాబితా విడుదలైతేనే, విజయ్ అసలు వ్యూహం ఏంటో స్పష్టమవుతుంది.  


 

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Telangana Politics: రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget