అన్వేషించండి

Thalapathy Vijay: మిత్రపక్షాల డిమాండ్లు, అన్నాడీఎంకే రెబల్స్ ఆశలు - కేబినెట్ విస్తరణే విజయ్‌ ముందున్న పెద్ద సమస్య - తేడా వస్తే?

CM Vijay : విజయ్ ముందు ఇప్పుడు అత్యంత సంక్లిష్టమైన కేబినెట్ విస్తరణ సవాల్ నిలిచింది. మిత్రపక్షాల డిమాండ్లు, అన్నాడీఎంకే రెబల్స్ ఆశలు ఆయనకు సమస్యగా మారుతున్నాయి.

TamilNadu Cabinet Expansion: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ ముందు ఇప్పుడు అత్యంత సంక్లిష్టమైన  కేబినెట్ విస్తరణ  సవాల్ నిలిచింది.  ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టి అధికారంలోకి వచ్చిన టీవీకే , సంకీర్ణ ధర్మాన్ని పాటించడంలో అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. కేవలం తొమ్మిది మంది మంత్రులతో చిన్న కేబినెట్‌ను ప్రారంభించిన విజయ్, తదుపరి విస్తరణలో మిత్రపక్షాల డిమాండ్ల, అంతర్గత రాజకీయ సమీకరణాలను ఎలా సమన్వయం చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 అన్నాడీఎంకే రెబల్స్ రాజకీయం 

విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సుమారు 25 మంది ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిస్వామి  పై తిరుగుబాటు చేసి విజయ్‌కు అండగా నిలిచారు.  అయితే, వీరికి కేబినెట్‌లో చోటు కల్పిస్తే అది రాజకీయ అనైతికత  అవుతుందని విదుతలై చిరుతైగల్ కట్చి వంటి మిత్రపక్షాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఫిరాయింపుదారులకు పెద్దపీట వేస్తే పార్టీ సిద్ధాంతానికే ముప్పు వస్తుందని, అన్నాడీఎంకే రెబల్స్‌ను కేబినెట్‌లోకి తీసుకోవద్దని వీసీకే నేత తిరుమావళవన్ బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు.

 కాంగ్రెస్ డిమాండ్లు - పవర్ షేరింగ్  అనివార్యం! 

చాలా ఏళ్ల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామ్యం కోసం కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌కు కనీసం రెండు లేదా మూడు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని ఆ పార్టీ అధిష్టానం సంకేతాలిస్తోంది. ముఖ్యంగా మేలూరు ఎమ్మెల్యే పి. విశ్వనాథన్ , కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత రాజేష్‌కుమార్‌లకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని తమిళ మీడియా కోడై కూస్తోంది. రాహుల్ గాంధీతో విజయ్‌కు ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా కాంగ్రెస్‌ను విస్మరించడం ఆయనకు సాధ్యం కాకపోవచ్చు.

 వీసీకే  ఎత్తుగడ - డిప్యూటీ సీఎం పోస్ట్? 

ప్రభుత్వ మనుగడకు అత్యంత కీలకమైన వీసీకే ఇప్పుడు  కింగ్ మేకర్  పాత్రలో ఉంది. విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి ఆ పార్టీ పెట్టిన ప్రధాన షరతులలో డిప్యూటీ సీఎం  పదవి ఒకటి అని తెలుస్తోంది. దళిత ఓటు బ్యాంకును భారీగా ప్రభావితం చేసే వీసీకేకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరో రెండు కీలక పోర్ట్‌ఫోలియోలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ విజయ్ ఈ డిమాండ్‌కు తలొగ్గితే, తమిళనాడు చరిత్రలోనే ఒక దళిత నేత ఉప ముఖ్యమంత్రి కావడం విశేషం అవుతుంది. అయితే, ఇది ఇతర సామాజిక వర్గాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని టీవీకే వ్యూహకర్తలు ఆలోచనలో పడ్డారు.

 సొంత పార్టీ నేతల అసంతృప్తి ముప్పు 

కేవలం తొమ్మిది మందితోనే కేబినెట్ ఏర్పాటు చేయడంతో, టీవీకేలోని సీనియర్ నేతలు , క్షేత్రస్థాయిలో కష్టపడిన వారు తమకు ఎప్పుడు అవకాశం దక్కుతుందా అని ఎదురుచూస్తున్నారు. మిత్రపక్షాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే, పార్టీని నిర్మించిన వారు అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఈ  కారణంగానే విజయ్ తన కేబినెట్‌లో కుల సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం మరియు మిత్రపక్షాల గౌరవం.. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి విజయ్ ప్రభుత్వం 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సురక్షితంగా ఉన్నప్పటికీ, కేబినెట్ విస్తరణలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మిత్రపక్షాలు వైదొలిగే ముప్పు పొంచి ఉంది.   అందుకే, విస్తరణ ప్రక్రియను అత్యంత గోప్యంగా, జాగ్రత్తగా నిర్వహించాలని విజయ్ భావిస్తున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Telangana Politics: రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News:మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget