News
News
X

Munugode Bypolls : మునుగోడులో ప్రచాారానికి అన్న - ఎప్పుడైనా రెడీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి !

హైకమాండ్ ఆదేశిస్తే మునుగోడులో ప్రచారం చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఆయనతో భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు.

FOLLOW US: 

Munugode Bypolls :    కాంగ్రెస్‌లో మునుగోడు ప్రకంపనలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రియాంకా గాంధీతో భేటీ తరవాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీ పడినట్లుగా కనిపిస్తోంది.  ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. వారి మధ్య తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు... హైకమాండ్ స్పందన .. మునుగోడులో గెలుపు అవకాశాలు.. అభ్యర్థి నిర్ణయంపై చర్చ  జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా హైకమాండ్ స్పందన తనకు సంతృప్తిని ఇచ్చిందని... పార్టీ విజయం కోసం ప్రయత్నిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. 

హైకమాండ్ ఆదేశిస్తే మునుగోడులో ప్రచారానికి రెడీ 

మునుగోడు ప్రచారానికి తాను సిద్ధమని.. ఎప్పుడు ఆదేశించినా తాను ప్రచారానికి వెళ్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు.  భట్టి విక్రమార్కతో అభ్యర్థి ఎంపికపై చర్చించామన్నారు. సోనియా, ప్రియాంకా గాందీల నిర్ణయం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి  ఎంపిక జరుగుతుందని కోమటిరెడ్డి చెబుతున్నారు.  మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న సోదరుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఆ స్థానానికి ఉపఎన్నిక వస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పటి నుండి వెంకటరెడ్డి వ్యవహారశైలి కూడా మారిపోయింది. ఆయన పార్టీని వీడిన సోదరుడ్ని ఒక్క మాట కూడా అనడం లేదు కానీ.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమను కించ పరుస్తున్నారని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. మునుగోడు అంశంపై ప్రియాంకా గాంధీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా హాజరు కాలేదు. తర్వాత విడిగా భేటీ అయ్యారు. 

కుప్పంలో చంద్రబాబు డ్రామా, 2014లోనే అన్న క్యాంటీన్లు ఎందుకు పెట్టలేదు- సజ్జల

రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తిలో ఉన్న కోమటిరెడ్డి 

రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలిసిన రోజునే వెంకటరెడ్డి కూడా కలిశారు. దీంతో ఆయన ఎలాగోలా కాంగ్రెస్ పార్టీ నుంచి గెంటివేయించుకుంటే బీజేపీలో చేరవచ్చని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే ఆయన సొంత పార్టీనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. ఆయన చెప్పిన తర్వాత క్షమాపణ చెబితే సరిపోదన్నారు. అలాగే తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడాన్ని కూాడ కోమటిరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రచారానికి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే హైకమాండ్  ఆదేశించాలని అంటున్నారు. 

నెల్లూరు నేతలు, అధికారులపై సీఎం జగన్ ఆగ్రహం, ఎంతవరకు నిజం?

కోమటిరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బాధ్యతలు ఇస్తుందా ?

మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌కు తాడేపేడో ఎన్నిక. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తాడన్న ప్రచారం జరగగానే అన్న వెంకటరెడ్డి అభ్యర్థి అయితే ఎలా ఉంటుందన్న అభిప్రాయంఎ క్కువగా వినిపించింది. ఇప్పుడు కూడా వెంకటరెడ్డి అయితేనే బలమైన అభ్యర్థి అవుతారని కొంత మంది హైకమాండ్‌కు సూచిస్తున్నారు.  అయితే ఇప్పుడు నిజంగానే హైకమాండ్ ఆయనను పోటీ చేయమంటే చేస్తారో లేదోనని కాంగ్రెస్ వర్గాలు సందేహిస్తున్నాయి. ఇప్పటికైతే కోమటిరెడ్డి కాకుండా నలుగురి పేర్లను ఫైనలైజ్ చేశారు. 

Published at : 25 Aug 2022 07:36 PM (IST) Tags: Bhatti Vikramarka Congress High Command Komatireddy Venkatareddy

సంబంధిత కథనాలు

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

TDP Twitter Hack : టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - ఇప్పుడు అందులో ఏం పోస్టులు ఉన్నాయంటే ?

TDP Twitter Hack : టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - ఇప్పుడు అందులో ఏం పోస్టులు ఉన్నాయంటే ?

YSRCP Vs TRS : ఆల్ ఈజ్ నాట్ వెల్ - టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ మధ్య ఏం జరుగుతోంది ?

YSRCP Vs TRS :   ఆల్ ఈజ్ నాట్ వెల్  -  టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ మధ్య ఏం జరుగుతోంది ?

Telangana Model : గుజరాత్‌ మోడల్‌కు తెలంగాణ మోడల్‌తో చెక్ - కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ ప్లాన్ బ్లూ ప్రింట్ ఇదే !

Telangana Model :  గుజరాత్‌ మోడల్‌కు తెలంగాణ మోడల్‌తో చెక్ - కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ ప్లాన్ బ్లూ ప్రింట్ ఇదే !

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

టాప్ స్టోరీస్

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు