Sajjala On Chandrababu : కుప్పంలో చంద్రబాబు డ్రామా, 2014లోనే అన్న క్యాంటీన్లు ఎందుకు పెట్టలేదు- సజ్జల
Sajjala On Chandrababu : కుప్పం ప్రజలు చంద్రబాబును రిజెక్టు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో చంద్రబాబు గొడవ పెట్టారని ఆరోపించారు.
![Sajjala On Chandrababu : కుప్పంలో చంద్రబాబు డ్రామా, 2014లోనే అన్న క్యాంటీన్లు ఎందుకు పెట్టలేదు- సజ్జల Amaravati Sajjala ramakrishna reddy criticizes chandrababu kuppam ysrcp tdp clashes DNN Sajjala On Chandrababu : కుప్పంలో చంద్రబాబు డ్రామా, 2014లోనే అన్న క్యాంటీన్లు ఎందుకు పెట్టలేదు- సజ్జల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/9cd25788494b85da8fdaefbe00428c921661433093399235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sajjala On Chandrababu : కుప్పంలో చంద్రబాబు సిగ్గు లేకుండా డ్రామా చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఆవేశం చూస్తే ఏదో జరిగిపోతోందని భ్రమ పెట్టేలా ఉందన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో చంద్రబాబు గొడవ పెట్టారని, అసలు చంద్రబాబు చేసేది రాజకీయమా? అని ప్రశ్నించారు. జనంలో భయ భ్రాంతులు కలిగేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో నిజమైన అభివృద్ధి ప్రజలు రుచి చూశారని సజ్జల అన్నారు. రాజకీయం అంటే కెమెరా లైట్స్ ఆన్ కాదని, ఇప్పడు చంద్రబాబుకు ఇంకో నటుడు తోడయ్యాడన్నారు. వీరిద్దరూ కలిసి వేస్తు్న్న చిల్లర వేషాలు ప్రజలపై రుద్దుతున్నారన్నారు. రాష్ట్రంతో పాటు కుప్పంలో కూడా చంద్రబాబు రిజెక్ట్ అయ్యారని అన్నారు. చుట్టపు చూపుగా వెళ్లే కుప్పంలో ఆఫీస్ ఓపెన్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఇప్పుడు కుప్పంలో అభివృద్ధి అంటున్నారని వ్యాఖ్యానించారు.
వైసీపీ కార్యకర్తలపై దాడి
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారని సజ్జల రామకృష్టారెడ్డి. వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు ధ్వంసం చేశారన్నారు. చంద్రబాబు వస్తుంటే వైసీపీ జెండాలు పెడతారా అని టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారన్నారు. టీడీపీ నేతలు కర్రలు తీసుకుని ఊరేగింపుగా వెళ్లారని, ఈ దాడికి చంద్రబాబు నాయుడే మొదటి ముద్దాయి అని ఆరోపించారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు. వైసీపీ ఈ దాడులకు వైసీపీ కార్యకర్తలు నిరసన తెలిపితే వారిపైనా టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు డిప్రెషన్ తో బాధ పడుతున్నారని సజ్జల విమర్శించారు.
చంద్రబాబు వైఖరితో విసుగు
చంద్రబాబు 30 ఏళ్లుగా దొంగ ఓట్లతో గెలుస్తూ వచ్చారని సజ్జల ఆరోపించారు. వాటికి వైసీపీ బ్రేక్ వేయడంతో చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి కుప్పం నియోజకవర్గం ప్రజల్ని వైసీపీ రక్షించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని, చంద్రబాబు వైఖరితో ప్రజలు విసుగు చెందిందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. టీడీపీ జెండాలు కట్టుకోవచ్చని, కానీ ఇతర పార్టీల జెండాలు తొలగించడం ఎందుకని ప్రశ్నించారు.
పవన్ కు కౌంటర్
చంద్రబాబు, పవన్ మధ్య రహస్య బంధం ఎందుకని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఇద్దరూ కలిసి పని చేస్తున్నారని ఓపెన్ సీక్రెట్ అన్నారు. వైసీపీ విముక్త ఏపీ అని పవన్ చేసిన వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. సంక్షేమ పథకాలను తొలగించాలని పవన్ కోరుకుంటున్నారన్నారు. సీఎం జగన్ అంటేనే సంక్షేమం అని, ఆ సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలకు అందకుండా చేయాలనే దురుద్దేశంతో పవన్, చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు. పేదల కడుపు నింపాలనుకుంటే 2014లోనే అన్న క్యాంటీన్లు ఎందుకు పెట్టలేదని సజ్జల ప్రశ్నించారు.
Also Read : AP News : ఢిల్లీలో బుగ్గన సహా 10 మంది ముఖ్య కార్యదర్శులు - ఏపీ అప్పులపై ఢిల్లీలో హైలెవల్ మీటింగ్ !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)