అన్వేషించండి

BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!

KCR : బీఆర్ఎస్ పార్టీని యువరక్తంతో నింపాలని కేసీఆర్ నిర్ణయించారు. అన్ని కమిటీలను రద్దు చేశారు. పని చేయని పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

BRS young blood: తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ పూర్వ వైభవం సాధించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన కీలక సమావేశంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు గులాబీ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేసి,  కొత్త రక్తం ఎక్కించేందుకు ఆయన సిద్ధమవ్వడం.. పాత తరం నేతల ఆధిపత్యానికి స్వస్తి పలికి యువతకు పట్టం కట్టాలనే సంకేతాలను స్పష్టంగా ఇస్తోంది.

కేటీఆర్‌కు క్షేత్రస్థాయి పగ్గాలు  

ఈ ప్రక్షాళనలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ మరింత కీలక బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నిర్మించే బాధ్యతను ఆయనకు అప్పగిస్తూనే, భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేసేందుకు వినూత్న ప్రణాళికను ప్రకటించారు. ప్రతి కాలేజీలో బీఆర్ఎస్ కమిటీలు వేయాలని, యువతను పార్టీలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా, నిరంతరం ప్రజల్లో ఉండేలా దూకుడుగా ముందుకు వెళ్లాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.

 టీడీపీ ప్రస్తావన.. ఆంతర్యమేమిటి? 

కేసీఆర్ తన ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ తో   పాత పొత్తును, నాటి పరిస్థితులను ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. తెలంగాణ ఏర్పాటుకు ఆనాడు అంగీకరించినందునే పొత్తు పెట్టుకున్నామని ఆయన గుర్తు చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం గతాన్ని గుర్తు చేయడమా? లేక మారుతున్న రాజకీయ సమీకరణలతో భవిష్యత్తులో ఏదైనా కొత్త సమీకరణాలకు సంకేతమా? అన్నది క్యాడర్‌కు అంతుచిక్కడం లేదు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన కేసీఆర్, వ్యక్తిగతంగా ఆయన పేరును పలకడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. రాజకీయ ప్రత్యర్థిని పేరుతో సంబోధించడం ఇష్టం లేని తన పాత పంథానే ఆయన అనుసరిస్తున్నారు. అదే సమయంలో, సొంత కుమార్తె కవిత గురించి గానీ, ఆమె కొత్తగా పెట్టిన రాజకీయ పార్టీ లేదా తలెత్తిన విభేదాల గురించి గానీ ఆయన ఎక్కడా స్పందించలేదు.    

రివైవల్' యజ్ఞం ఫలిస్తుందా? 

యువతకు ప్రాధాన్యమిచ్చేలా కేసీఆర్ వేసిన ఈ  మాస్టర్ ప్లాన్  పార్టీని మళ్లీ గాడిలో పెడుతుందా అన్నది చూడాలి. పాత నేతలను పక్కన పెట్టి యువతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొంత అసంతృప్తి వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ, పార్టీ మనుగడకు ఇది తప్పనిసరని ఆయన భావిస్తున్నారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్లను పార్టీలోకి తీసుకుంటూనే, మరోవైపు కాలేజీ స్థాయి నుంచి క్యాడర్‌ను సిద్ధం చేయడం ద్వారా బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందని గులాబీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.             

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
JC Prabhakar Reddy Tadipatri Politics: తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ
తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ
Pawan Kalyan Home Minister Portfolio: పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Username Row: వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
Sierra EV Launch: టాటా సియారా EVతో పోలిస్తే క్రెటా , కర్వ్ EVలు ఎందుకు వెనుకబడింది?
టాటా సియారా EVతో పోలిస్తే క్రెటా , కర్వ్ EVలు ఎందుకు వెనుకబడింది?
Stay Positive : రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
Embed widget