JC Prabhakar : తాగుబోతుతో తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరింప చేస్తావా ? ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై విరుచుకుడ్డ జేసీ
తాడిపత్రిలో ఎమ్మెల్యే తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనుమతుల్లేకపోవడంతో అనుచరులతో ప్రారంభోత్సవం చేశారు.దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సెటైర్లు వేశారు.
తాడిపత్రి ఎమ్మెల్యే తన తండ్రి విగ్రహాన్ని ఇరవై నాలుగు గంటలూ తాగి తూలే వ్యక్తితో ఆవిష్కరింపచేశామని .. తండ్రిని భ్రష్టు పట్టించామని జేసీ ప్రభాకర్ రెడ్డి ( JC Prabhakar Reddy ) విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ( kethireddy pedda reddy ) తన తండ్రి రామిరెడ్డి విగ్రహాన్ని తాడిపత్రిలోని జాతీయ రహదారి మధ్యలో ఏర్పాటు చేశారు. దానికి ఎలాంటి అనుమతులు లేవు. తాడిపత్రి-అనంతపురం ప్రధాన రహదారిలో యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచిన ప్రాంతంలో విగ్రహాన్ని పెట్టారు. హైవేపై విగ్రహాలు పెట్టకూడదన్న సుప్రీం కోర్టు ( Supreme Court ) నిబంధనలు ఉండటంతో అనుమతులు రాలేదు. మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉండటంతో అనుమతి వచ్చే అవకాశాలు కూడా లేవు. దీంతో తాడిపత్రి ఎమ్మెల్యే ( Tadipatri ) అనుచరులే ఆవిష్కరించేసి దండలు వేశారు.
ఆనం వర్సెస్ నేదురుమల్లి ! నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో రచ్చ రచ్చ
దీనిపై ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కోర్టు ఆదేశాలను దిక్కరించి తాడిపత్రిలో ఎమ్మెల్యే తన తండ్రి విగ్రహాం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. అనంతపురంలో ( Anantapuram ) రహదారి కోసం విగ్రహాలన్నీ తొలగిస్తున్నారని... దీనిపై మున్సిపల్ కమిషనర్ నుంచి రాష్ట్ర అధికారి వరకు ఫిర్యాదు చేశామన్నారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఆయన తండ్రి విగ్రహాన్ని నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. ఒక అనామకుడితో, తాగు బోతుతో విగ్రహావిష్కరణ చేశావని మండిపడ్డారు. పెద్దారెడ్డి తండ్రి ఓ అనామకుడని.. తన తండ్రి ఓ స్వాతంత్ర్య సమరయోధుడని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర విభజనపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయాలి - ఉండవల్లి సలహా !
ఎమ్మెల్యే చేసిన పనికి తాడిపత్రి ( Tadipatri ) ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కలెక్టర్ ఈ విషయంలో విఫలమయ్యారు.. ఎందుకు ఐఏఎస్ లు, ఐపీఎస్ లని ప్రశ్నించారు. తాను ఇదంతా మాట్లాడినందుకు మళ్లీ జైలుకు పంపొచ్చు.. నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. నిబంధనల ప్రకారం ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ( MLA Pedda Reddy ) మాత్రం తన తండ్రి విగ్రహాన్ని పట్టణం నడిబొడ్డున జాతీయ రహదారి మద్య తన అనుచరులతో ఆవిష్కరింప చేసుకున్నారు. తాడిపత్రిలో రెండు వర్గాల మధ్య ఉప్పు, నిప్పులా పరిస్థితి ఉంటుంది. ఫ్యాక్షన్ గొడవలు కూడా ఉండటంతో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతూ ఉంటాయి.