Anam Vs Nedurumalli : ఆనం వర్సెస్ నేదురుమల్లి ! నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో రచ్చ రచ్చ
నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో ఆనం వర్సెస్ నేదురుమల్లి వర్గాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. దీనికి జిల్లాల విభజనే కారణం అవుతోంది.
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీలో ( YSRCP ) వర్గ విభేదాలు మరోసారి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా వెంకటగిరి ( Venkatagiri ) నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ( Anam ) మరో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నాయకుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ( Nedurumalli ) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. జిల్లాల విభజనపై ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ దీక్షలు కూడా ప్రారంభించారు. మూడు మండలాల ప్రజలతో కలిసి ఆందోళనలు ప్రారంభించారు. అయితే ఇది రాజకీయ ప్రేరేపితమని ఆయనకు రాజకీయ భవిష్యత్ లేదని తెలిసే ఇలాంటి ఆందోళనలు ప్రారంభించారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు..
రాష్ట్ర విభజనపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయాలి - ఉండవల్లి సలహా !
బాలాజీ జిల్లాకి ( Balaji District ) వెంకటగిరి ప్రజలు ఎక్కడా వ్యతిరేకంగా లేరని ఆనం రామ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాపూరు కి ఎమ్మెల్యే గా ఉన్నారు గా ఏమాత్రం అభివృద్ధి చేశారో చెప్పాని ఆనం రామనారాయణరెడ్డి నేదురుమల్లి డిమాండ్ చేశారు. బాలాజీ జిల్లాను ప్రతిపక్షాలు కూడా స్వాగతించారు మీరు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో అందరికి తెలుసని విమర్శిస్తున్నారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి లేకుంటే ఆనంకు రాజకీయ భవిష్యత్ లేదని.. ఆనం ఫ్యామిలీని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే జనార్ధన్ రెడ్డి హయాంలోనే ఎప్పుడో పక్కన పెట్టేవారన్నారు. నీ అజెండా ఏంటో అందరికీ తెలుసు నీతి మాలిన రాజకీయాలు చెయ్యవద్దని హెచ్చరించారు.
ప్రభుత్వ వ్యతిరేక దీక్షల్లో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే - నెల్లూరు రాజకీయాల్లో కలకలం !
వెంకటగిరి నియోజకవర్గంలో ఆనం వర్సెస్ నేదురుమల్లి అనే పోరు ఇటీవలే ప్రారంభమయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆనం రామనారాయణను పక్కన పెట్టి నేదురుమల్లికి జగన్ ( CM Jagan ) ప్రాధాన్యం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆనంకు వైఎస్ఆర్‌సీపీలో ప్రాధాన్యత కనిపించడం లేదు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకూ పెద్దగా ఆహ్వానాలు అందడం లేదు. ఈ క్రమంలో జిల్లాల విభజనకు వ్యతిరేకంగా ఆనం గళమెత్తడం నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ రాజకీయాల్లో కొత్త కలకలంగా మారింది.
సూట్‌కేస్ కంపెనీలతో దుబాయ్‌లో ఎంవోయూలు - మంత్రి గౌతంరెడ్డిపై నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు !
నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ బలంగా ఉంది. జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే పదింటిలోనూ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే వారి మధ్య ఆధిపత్య పోరాటం కారణంగా పార్టీకి ఇ్బబందులు ఎదురవుతున్నాయి.