Nara Lokesh : సూట్‌కేస్ కంపెనీలతో దుబాయ్‌లో ఎంవోయూలు - మంత్రి గౌతంరెడ్డిపై నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు !
దుబాయ్‌లో సూట్ కేస్ కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారని మంత్రి గౌతం రెడ్డిపై నారా లోకేష్ ఆరోపణలు చేశారు. రూ. 3వేల కోట్లు పెట్టుబడి పెడతామన్న కంపెనీ గురించిన వివరాలు వెల్లడించారు.
దుబాయ్ ఎక్స్‌పోలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ మంత్రి గౌతంరెడ్డితో ఎంవోయూ చేసుకున్న కాజస్ ఈ మొబిలిటి అనే కంపెనీపై ఆరోపణలు వెల్లువెల్లువెత్తుతున్నాయి. అదో సూట్ కేస్ కంపెనీ అని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించారు. ఆ కంపెనీని గత ఏడాదే ప్రారంభించారని కేవలం ఆ కంపెనీ పెట్టుబడి రూ. లక్ష మాత్రమేనని ఆయన ఓ డాక్యుమెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఎన్ని కేసులు మెడకి చుట్టుకున్నా @ysjagan ఆయన మనుషులు సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరు. దుబాయ్ ఎక్స్ పో వేదికగా ఖాళీకుర్చీలతో గౌరవ పరిశ్రమల శాఖా మంత్రి @MekapatiGoutham పెద్ద ఎంవోయూ కుదుర్చుకున్నారు.(1/4) pic.twitter.com/UE4GTRSfsM
— Lokesh Nara (@naralokesh) February 17, 2022
ఏపీ ప్రభుత్వ అధికారులు లండన్‌కు చెందిన కాజస్ ఈ మొబిలిటి కంపెనీ కడప జిల్లాలో రూ. మూడు వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఎంవోయూ చేసుకుందని ప్రకటించారు. ఆ కంపెనీ డైరక్టర్లు రవికుమార్ పంగా, మరుదూర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌లు ఈ ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. అయితే అది లండన్ బేస్డ్ కంపెనీ కాదని ఇండియాలో నమోదయిందని లోకేష్ డాక్యుమెంట్‌లో వివరించారు. CAUSIS E-MOBILITY PRIVATE LIMITED పేరుతో ఇరవై నెలలు మాత్రమే కంపెనీని ప్రారరంభించారు. ఈ విషయాన్ని లోకేష్ వెల్లడిస్తూ సూట్ కేసు కంపెనీల బుద్ది పోనిచ్చుకోలేదని విమర్శించారు.
క్షణమైనా టిక్కెట్ రేట్ల పెంపు జీవో - ఏపీ ప్రభుత్వం వైపు చూస్తున్న టాలీవుడ్ !
నిజానికి ఈ CAUSIS E-MOBILITY PRIVATE LIMITED కంపెనీ ఇండియాలో రిజిస్టర్ అవగానే మహారాష్ట్రతో గత ఏడాది జూన్‌లోనే ఓ ఒప్పందం చేసుకున్నారు. ఆ రాష్ట్రంలో ఏకంగా రూ. 2800 కోట్ల పెట్టుబడి పెడతామన్నారు. కానీ ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంతో కడలోకు వచ్చి రూ. మూడు వేల కోట్లు పెడతామని ఎంవోయూ చేసుకున్నారు.
బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్
ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూల గురించి మీడియాకు సమాచారం ఇచ్చారు కానీ అధికారికంగా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ట్విట్టర్‌లో కానీ.. ఏపీఈడీబీ ట్విట్టర్ అకౌంట్లలో కానీ ఎలాంటి వివరాలు చెప్పలేదు. నారా లోకేష్ ఆరోపణలపై ఇంకా మంత్రి గౌతం రెడ్డి కానీ ఆ కాజస్ కంపెనీ నుంచి కానీ ఎలాంటి ఖండన ప్రకటన రాలేదు.