Ambulance Stuck in Heavy Rain | వరదల్లో చిక్కుకున్న అంబులెన్స్
గత రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షం సమాచారం ముందుగానే తెలుసుకున్న హైడ్రా , DRF బృందాలు అప్రమత్తమైయ్యారు. రహదారులపై చెట్లు పడిపోగా వెనువెంటనే వాటిని తొలగించే పనులు చేపట్టారు. వరద నీరు తొలగించేందుకు హెవీ పంపులు వినియోగించారు. కృష్ణ నగర్లో వరదలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చుతున్న హైడ్రా DRF సభ్యులు
అమీర్ పెట్ మెట్రో స్టేషన్ .. మైత్రేయవనం వద్ద వరదలో చిక్కుకున్న ఒక అంబులెన్స్ కు హైడ్రా , DRF బృందాలు సహాయం చేసాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలని నీట మునిగాయి. హుసేన్ సాగర్ కు భారీ వరద వచ్చి చేరుతుంది. నగరంలో 10 నుంచి 14 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 13 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.





















