Owaisi Comments on Ind - Pak Match | క్రికెట్ మ్యాచ్ పై ఓవైసీ కీలక వ్యాఖ్యలు
ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత్ సీనియర్లు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్ ఆడేది లేదని స్పష్టం చేశారు. కానీ ఆసియా కప్‌లో ఇండియా పాకిస్తాన్ మ్యాచులను కు బాయ్‌కట్ చేయకుండా మరోసారి వేదికను మార్చారు. ఇందుకు సంబంధించి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లో జరగబోతున్న ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌ను తాను చూడనని అన్నారు ఎంపీ ఒవైసీ. దుబాయ్‌లో పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నామని తెలిసి నేను షాక్ అయ్యాను. ఆ మ్యాచ్ ను నేను చూడను అని అన్నారు. నీళ్ళు, రక్తం కలిసి ప్రవహించలేవని... చర్చలు ఉగ్రవాదం కలిసి వెళ్ళలేవని ప్రధాని చాలాసార్లు చెప్పినప్పుడు మీరు ఎలా పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడతారంటూ ఒవైసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రజలను వారి కుటుంబాల ముందే కాల్చి చంపారు. ఇంత దారుణం జరిగిన తరువాత పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటంలో అర్థం లేదు అని అంటున్నారు ఒవైసీ.





















