(Source: ECI/ABP News/ABP Majha)
Harish Rao News : మా జోలికి రాకపోతే మీకే మంచిది - ఏపీ మంత్రికి హరీష్ రావు వార్నింగ్ !
ఏపీ మంత్రి కారుమూరికి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. తమ జోలికి రాకపోతే మీకే మంచిదని హెచ్చరించారు.
Harish Rao News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన హరీష్ రావుకు ఏపీ మంత్రులు గట్టి కౌంటర్ ఇచ్చారు.దీనిపై హరీష్ రావు స్పందించారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందని స్పష్టం చేశారు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉందన్నారు. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉందని గుర్తు చేశారు. కెసిఆర్ కిట్ ఉంది. కళ్యాణ లక్ష్మి ఉంది. ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉందన్నారు. ఏపీలో ఏమి ఉందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కేంద్రం ఎగబెట్టిన ఎం అడగరుని.. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరూ మాట్లాడటం లేదని విమర్శఇంచారు. విశాఖ ఉక్కు ను తుక్కు కింద పెట్టినా మాట్లాడని పరిస్థితి ఉందన్నారు. అధికార పార్టీ అడగదు ప్రతి పక్షం ప్రశ్నించదు.. రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పని చేస్తున్నాయని విమర్శఇంచారు. అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకండి అది మీకే మంచిదని సూచించారు.
అంతకు ముందు ఏపీ మంత్రి కారుమూరి హరీష్ రావు వ్యాఖ్యలపై ఆ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు దౌర్భాగ్యపు మాటలు మానుకోవాలని సూచించారు కారుమూరి. హరీష్ రావు టైం చూసుకొని ఏపీ వచ్చే ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తామన్నారు. తెలంగాణ స్కూళ్లకు, ఏపీలో బడులకు తేడాగా గమనించాలన్నారు. హైదరాబాద్‌లో వర్షాలు వస్తే ఇళ్లపైకి నీళ్లు వస్తాయని ఎద్దేవా చేశారు. అన్ని సౌకర్యాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా తగలేసుకున్నారో ప్రజలు, ప్రతిపక్షాలే చెబుతున్నాయన్నారు కారుమూరి. ఒక్క హైదరాబాద్‌లో రోడ్లు వేస్తే సరిపోదని... రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఓట్లు వేసిన వారికే తెలంగాణలో లబ్ధికలిగిస్తున్నారని... ఆంధ్రప్రదేశ్ అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగిస్తున్నామన్నారు. తాము చేసిన అభివృద్ధి మూలంగానే దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్నామని చెప్పుకచ్చారు.
అసలు వివాదం హరీష్ రావు కామెంట్లతోనే ప్రారంఏభమయింది. సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ గురించి వ్యాఖ్యలు చేశారు. ఏపీ నుంచి వచ్చిన కార్మికులు వారు అప్పుడప్పుడూ సొంతూరికి వెళ్లినప్పుడు అక్కడి రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఏలా ఉంటుందో మీకు తెలియదా? అని అడిగారు. ‘‘అంత తేడా ఉన్నప్పుడు మరి మీకు అక్కడ ఓటెందుకు? అక్కడ బంద్ చేసుకొని ఇక్కడ నమోదు చేసుకోండి. మీరు కూడా మావాళ్లే’’ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఒక చోటే ఓటు పెట్టుకోండి.. గదీ తెలంగాణలోనే పెట్టుకోండి అని హరీశ్ రావు కోరారు. తెలంగాణలో వ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలను నిలిపివేసిందని హరీశ్ రావు అన్నారు. అదే ఏపీలో మోటార్ల దగ్గర మీటర్లు పెట్టి ఆ ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు తెచ్చుకుందని ఆరోపించారు. ఏపీకి, తెలంగాణకు ఉన్న తేడా ఇదేనని చెప్పారు.
హరీష్ రావు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలోనూ ఏపీ ప్రభుత్వ పనితీరుపై హరీష్ రావు ఇలాంటి కామెంట్లు చేశారు. ఇప్పుడు మరోసారి అలాంటివే చేశారు. అయితే ఒక్క కారుమూరి మాత్రమే స్పందించారు.. మిగతా సైలెంట్ గా ఉన్నారు.