(Source: ECI/ABP News/ABP Majha)
Undavalli On Jagan : మళ్లీ జగన్ క్విడ్ ప్రో కో - గేంబ్లింగ్ చేస్తున్నారని ఉండవల్లి ఆరోపణలు !
జగన్మోహన్ రెడ్డి మళ్లీ క్విడ్ ప్రో కో కు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. గేంబ్లింగ్ ఆడుతున్నారని విమర్శించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) క్విడ్ ప్రో కో చేస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ( Undavalli Arun kumar ) ఆరోపించారు. ప్రజలకు డబ్బులు ఇచ్చాను. వాళ్లు నాకు ఓటు వేయాల్నట్లుగా జగన్ విధానం ఉందన్నారు. అసలు క్విడ్ ప్రోకో అంటే ఇదేనన్నారు. ఓటు వేస్తారు అనుకున్న వారికి మాత్రమే పథకాలు ఇస్తున్నారని ఉండవల్లి స్పష్టం చేస్తున్నారు. అయితే పథకాల ( Nagadu Badili ) పేరుతో ఇచ్చి పన్నుల పేరుతో వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో పరిస్థితులపై ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ కు ధైర్మం ఉంటే రాజధానికి కమ్మరావతి అని పేరు పెట్టాలి : రేణుకా చౌదరి
ఏపీలో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ( Financial Management ) లేదని.. జగన్ ఎంత కాలం ఇలా బటన్స్ కొట్టి డబ్బులు ఇవ్వగలరో తెలియదన్నారు. ఇలాంటి గ్యాంబ్లింగ్ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ( Chandra babu ) పదివేలు పంచినా ఓట్లు వేయలేదన్నారు కేంద్రం నిధుల ( Central Funds ) మళ్లింపుపై విచారణ జరుగుతోందని.. విచారణలో ఫలితం ఏమొచ్చినా.. జగన్ ఏమీ ఫీల్ కారు. ఎందుకంటే.. పేద ప్రజలకు ఇచ్చానంటారన్నారు. జగన్‌కు ( CM Jagan )ఎవరూచెప్పేవారు లేరన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన జగన్ పోలవరం ప్రాజెక్టును ( Polavaram Project ) కేంద్రానికి ఎందుకు అప్పగించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు.
ఏపీలో మొదటి మొబైల్ సినిమా థియేటర్, మెగాస్టార్ ఆచార్య మూవీతో ఓపెనింగ్!
పొరుగు రాష్ట్రం తెలంగాణలో ( Telangana ) కరెంట్ కోతల్లేవని.. ఏపీలో విపరీతంగా కరెంట్ కోతలున్నాయని. ( Power Cuts ) .. మిగులు విద్యుత్ రాష్ట్రాన్ని జగన్ ఇలా తయారు చేశారన్నారు. విద్యుత్ కష్టాల నుంచి బయటపడటానికి ఎన్ని యుగాలు పడుతుందో చెప్పలేమన్నారు. ఏపీలో బీజేపీ ( AP BJP ) అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనందున డబ్బులు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేదన్నారు. అందుకే పోలవరం ప్రాజెక్ట్‌ను ( Polavaram )నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఎంపీలు గట్టిగా అడగలేరు. ఇప్పటి వరకు ఎప్పుడైనా పార్లమెంట్లో అడిగారా?. ఏపీ పునర్విభజన చట్టం ఎందుకు అమలు చేయట్లేదని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం జగన్ మోదీని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు.