Renuka Chowdhury : సీఎం జగన్ కు ధైర్యం ఉంటే రాజధానికి కమ్మరావతి అని పేరు పెట్టాలి : రేణుకా చౌదరి
Renuka Chowdhury :ఏపీ ప్రభుత్వానికి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సవాల్ విసిరారు. సీఎం జగన్ కు ధైర్యం ఉంటే రాజధానికి కమ్మరావతి అని పేరు పెట్టాలన్నారు. వైసీపీ నేతలకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు.
![Renuka Chowdhury : సీఎం జగన్ కు ధైర్యం ఉంటే రాజధానికి కమ్మరావతి అని పేరు పెట్టాలి : రేణుకా చౌదరి Nizamabad former mp Renuka Chowdhury criticized ap govt cm jagan on Kamma community comments Renuka Chowdhury : సీఎం జగన్ కు ధైర్యం ఉంటే రాజధానికి కమ్మరావతి అని పేరు పెట్టాలి : రేణుకా చౌదరి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/c7271c84fe8b974b00eb2d4225f3c13f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Renuka Chowdhury : కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిజామాబాద్ వర్నిలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. తెలంగాణ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ జిల్లా వర్నిలో జరిగిన ఆత్మీయ సమేళనంలో జాతీయ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వంపై రేణుకా చౌదరి విమర్శలు చేశారు. ఏపీ సర్కార్ కమ్మ కమ్యూనిటీని హేళన చేస్తుందన్నారు. ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని కమ్మరావతిగా మాట్లాడుతున్నారన్నారు. సీఎం జగన్‌కి ధైర్యం ఉంటే రాజధానికి కమ్మరావతి అని పేరు పెట్టాలన్నారు.
అధికారం ఉందని రెచ్చిపోవద్దు
కమ్మ సామాజిక వర్గాన్ని తక్కువగా చూస్తే జగన్‌కే నష్టమని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. కమ్మ వారి మంచితనాన్ని చేతకానితనంగా చూడొద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని కులాల ప్రజలు ఉన్నా, ప్రభుత్వం ఒక కులాన్నే టార్గెట్ చేసి మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. వైసీపీ నేతలు, జగన్‌కి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. అధికారం ఉందని రెచ్చిపోదన్నారు. పదవులు శాశ్వతం కాదన్న విషయం జగన్ గుర్తుపెట్టుకోవాలన్నారు.
Also Read : Theft In Nellore Court: కోర్టులో రూంలోనే దొంగతనం - ఏం ఎత్తుకుపోయారో తెలిస్తే అవాక్కవుతారు!
ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. సమయం దొరికినప్పుడల్లా వైసీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్, ఆ వర్గం నేతలపై కుల ఆరోపణలు చేస్తుంటారు. ఇవాళ తిరుపతిలో ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు తన వర్గానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇలాంటి ఆరోపణలు ఇటీవల తీవ్రం అయ్యాయి. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణలోని కమ్మ నేతలు మండిపడ్డారు. సీఎం జగన్ కొత్త కేబినెట్ కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవులు కావాలనే కేటాయించలేదని ఆరోపణలు వచ్చాయి. తాజాగా కమ్మ వారి ఆత్మీయ సమ్మేళనంలో రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఆమె చేసిన విమర్శలు ఆ పార్టీలు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read : Minister Peddi Reddy: ఏపీ ప్రజలకు ఏసీ లాంటి వార్త- విద్యుత్ కోతలపై మంత్రి గుడ్ న్యూస్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)