NTR centenary celebrations : పార్టీ పెడితే దున్నేస్తారని చెప్పింది ఆయనే - ఆయన చెప్పారంటే ఎన్టీఆర్ చేస్తారంతే !
ఎన్టీఆర్ మనసులో రాజకీయ ఆలోచన ఎవరు రేకెత్తించారో తెలుసా?
NTR centenary celebrations : ఎన్.టి.ఆర్. రాజకీయ కథల్లో నటించారు. చివరి చిత్రాలన్నీ కుళ్ళు రాజకీయాలపైనా, వ్యవన్గపైనా తిరుగుబాటుచేసే పాత్రలు ధరించినవే. ఆయా చిత్ర సందర్హాలలో అంకురించి అతని మనస్సును తొందరపెడుతున్న భావాలను మొదటిసారిగా ఒక షూటింగ్ లో ఎన్.టి.ఆర్. బయటపెట్టారు. బెట్ డోర్ షూటింగ్ కోసం మనాలికి వెళ్ళారు. అక్కడ షూటింగ్ లోకేషన్ లో బి.వి. మోహన్ రెడ్డి అనే మిత్రునితో ఎన్టీఆర్ "తెలుగు ప్రజలు" నన్ను ఇంతగా ఆదరించారు, అభిమానించి అందలం ఎక్కించారు. పేరు ప్రతిష్ట, కీర్తి సిరిసంపదలు అన్నీ ఇచ్చారు. వారికి నేను ఏమి బదులిచ్చి రుణం తీర్చుకోగలను" అని వ్యాఖ్యానించారు. బీవీ మోహన్ రెడ్డి మంచి జ్యోతిష్యుడు. ఆయన మాట అంటే ఎన్టీఆర్‌కు గురి.
రాజకీయ పార్టీ పెట్టాలని సలహా ఇచ్చిన బీవీ మోహన్ రెడ్డి
ఎన్టీఆర్ మాటలు విన్న బీవీ మోహన్ రెడ్డి " మీరు కన్తుక రాజకీయ రంగప్రవేశం చేస్తేప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. ఆంధ్ర ర్యాష్టానికి మీరే ముఖ్యమంత్రి" అని తన జ్యోతిషం వివరించారు. అప్పటికి మనసులో ఉందేమో కానీ 1980 ప్రాంతాలలో "సర్దార్ పాపారాయుడు" చిత్రం కోసం ఊటీలో షూటింగ్ లో తన రాజకీయ ఆలోచనలు మెల్లగా బయట పెట్టడం ప్రారంభించారు. సినిమా పత్రికల విలేఖరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా"60" ఏళ్ళు. నిండిన తర్వాత తాను ప్రజాజీవితంలోకి ప్రవేశించాలనుకుంంటున్నానని" తన మనసులోని మాట చెప్పారు. ఆనాటి రాజకీయ వ్యవస్థలోని అస్తవ్యస్త పరిస్తితులను తలచుకుని బాధ (ప్రకటించారు. ఈ వార్త ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. తర్వాత చంద్రబాబునాయుడు అల్లుడు కావాడం ఆయన రాజకీయ రంగప్రవేశాన్ని అమితంగా ప్రభావితం చేసింది. కాం[గెస్ లోని అస్టిర ధోరణులకు విసిగి చాలా మంది ప్రాంతీయపార్లీల గురించి చర్చించసాగారు. అల్లుడు అయిన తర్వాత చంద్రబాబు కూడా ఆయనతో తరచుగా ఈ విషయంలో చర్చించేవారు. మొదట జోస్యం చెప్పిన బీవీ మోహన్ రెడ్డి తర్వాత మంత్రి అయ్యారు. ఆయన కుమారుడు జయనాగేశ్వర్ రెడ్డి ఇప్పటికీ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యత్వం ఆఫర్
అప్పటికే ఎన్.టి.ఆర్. రాజకీయాలలోకి రాబోతున్నారన్న వార్తలు కాంగ్రెస్ నాయకులను కలవరపరిచాయి. చంద్రబాబు పెళ్లి సమయంలో ముఖ్యమంత్రి అంజయ్య ఎన్.టి.ఆర్.కు రాజ్యసభ నభ్యత్వాన్ని ఆఫర్ ఇచ్చారు. ఎన్.టి.ఆర్. తిరస్కరించారు. తర్వాత పూర్తికాలం ప్రజలకోసం పనిచేయాలనిఅనుకున్నారు. పరోక్షంగా రాజకీయాలలోకి రాబోతున్నట్లు తెలిపినా, ఎన్ని ప్రశ్నలు వేసినా, రాజకీయ రంగప్రవేశం గురించి సూటిగా మాట్లడలేదు. 1982 మార్చి 29న కొత్తపార్టీ ఏర్పాటుకు ముహుర్తం ఏర్పడింది. తాను "తెలుగు దేశం పార్దీ" అనే కొత్తపార్లీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆప్రకటనకు హర్దధ్వానాలతో జనామోదం లభించింది. తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదం ఆనాటి నుండి ఊపందుకుంది.ఒక కొత్త రూపంతో, కొత్త నినాదంతో, కొత్త ఒరవడితో, ఎన్.టి.ఆర్. ఒక మహెత్తుంగ తరంగమై లేచారు. ఆయన ఆశయాలకు జనం జేజేల వర్షం కురిపించారు.
ప్రచార సమ్మోహనం
ఆయన అభిప్రాయాలలో నిజాయితీ కనిపించెది. ఆయన రూపం మాత్రమే కాదు, కంఠస్వరం, మాట కూడా గంభీరంగా ఉండేది. గర్జిస్తున్నట్టలూ, ప్రత్యర్తులను గద్దిస్తున్నట్టలు ఉండేది. పర్యటనలోకొండలు, కోనలు, వాగులు, వంకలు, అన్నింటినీ అధిగమించి, మారుమూల పల్లేలను కూడా వదిలిపెట్టకుండా తిరిగి ప్రచారం చేశారు. అంత విసృతంగా జనం మధ్యకు వెళ్ళి ప్రచారం చేసిన రాజకీయ నాయకుడు మనదేశంలోనేకాదు, ప్రపంచంలోనే మరొకరు లేరు. ప్రచారంలో శంకరంబాడి సుందరాచార్య "మాతెలుగుతల్సికకి మల్లెపూదండ" గీతానికి, వేములపల్లి శ్రి కృష్ణ రాసిన "చెయ్యెత్తి జైకొట్టు" గీతానికి, జీవం పోశారు. ఆయన మార్గాన్నీ పద్దతులను దేశంలోని నాయకులందరు అనుసరించారు. అన్నీ కొత్త పద్దతులే, ఆంధ్ర దేశాన్ని మూడు సార్లు చుట్టివచ్చి 40వేల కిలోమీటర్లుప్రయాణించారు. ఆ ఓపిక, ఆ దీక్ష అపూర్వం, అనితరసాథ్యం. పార్టీలో ఆయనే హీరో, మిగతా వారందరూ జీరోలయ్యారు, ఆయనకు మిగతానేతలకు అంతస్తులో తేడా బాగా వచ్చింది. ఇక జనం ఆయన వస్తున్నారంకే చేతిలో ఉన్న పనులన్నీ వదిలి, సర్వం మరచి, పరుగులు పెట్టి వచ్చేవారు. రోడ్డుమై బారులు తీరి నిలబడేవారు.