అన్వేషించండి

Dharmana Brothers : ధర్మాన బ్రదర్స్ రాజకీయ సన్యాసం - సైలెంట్‌ అయిపోవడానికి అదేనా కారణం ?

Srikakulam : ధర్మాన బ్రదర్స్ రాజకీయాల నుంచి విరమించుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఓడిపోయిన దగ్గర నుంచి వారు బయట కనిపించడం లేదు. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

Dharmana brothers retiring from politics : శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ధర్మాన సోదరులు పొలిటికల్ రిటైర్మెంట్ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ తరపున పోటీ చేసి ఇద్దరూ ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇద్దరూ మంత్రులుగా చేశారు. మొదట ధర్మాన కృష్ణదాసు.. తర్వాత ధర్మాన ప్రసాదరావు మంత్రులుగా చేశారు. ఇద్దరూ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ కారణంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. వారి వారి నియోజకవర్గాల్లో వైసీపీ కార్యక్రమాలు చేపట్టడం లేదు. జగన్ తో సమావేశాల్లోనూ ఎక్కడా కనిపించడం లేదు. 

ఎన్నికల్లో అయిష్టంగానే పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు 

ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో కృష్ణదాసు కంటే సీనియర్. ఆయన 1989లో మొదటి సారి నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తంగా నాలుగు సార్లు గెలిచారు. మూడు సార్లు మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోనే సీనియర్ నేతగా  పేరు పొందారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయ పయనం గందరగోళంగా మారింది. ఆయన కంటే ముందే ఆయన సోదరుడు కృష్ణదాస్ జగన్ వెంట నడిచారు. దాంతో ఆయనకే వైసీపీలో ప్రాధాన్యం లభించింది. ఆ తర్వాత మరో ఆప్షన్ లేకపోవడంతో ధర్మాన కూడా వైసీపీలో చేరారు. శ్రీకాకుళం నుంచి ఓ సారి గెలిచి రెండు సార్లు ఓడిపోయారు. గత ఎన్నికల్లో మంత్రిగా ఉండి కూడా యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. 

వారసుడికి రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నం 

నిజానికి ధర్మాన ప్రసాదరావు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. తన వారసుడికి అవకాశం ఇవ్వాలని జగన్ పై ఒత్తిడి తెచ్చారు.కానీ జగన్ మాత్రం ధర్మాన ప్రసాదరావునే పోటీ చేయాలని ఒత్తిడి చేశారు. చివరికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఎన్నికలకు ముందే తాను పోటీ చేయలేను అన్నానని జగన్ ఒత్తిడి మేరకే పోటీ చేస్తున్నానని  చెప్పుకొచ్చేవారు. ఇది ప్లస్ అయిందో.. మైనస్ అయిందో కానీ ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. 

పక్క చూపులు చూస్తారా ?                                                   

ధర్మాన కృష్ణదాసు కూడా తన వారసుడ్ని ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకున్నారు.కానీ అవకాశం లభించలేదు.  టీడీపీ కూటమి భారీ విజయంతో వైసీపీకి ఇక భవిష్యత్ ఉంటుందా లేదా అన్న అనుమానం సిక్కోలు వైసీపీ నేతల్లో ప్రారంభమయింది. దానికి కారణం భారీగా వచ్చిన మెజార్టీలే. సంక్షేమ పథకాల ప్రభావం అసలేమీ లేకపోవడం వారిని ఆశ్చర్యపరిచింది. అందుకే రాజకీయ భవిష్యత్ పై ఆశలు వదిలేసుకున్నారని అంటున్నారు. కుదిరితే తమ వారసుల్ని టీడీపీ లేదా జనసేనల్లోకి పంపించడం మంచిదని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతల్లో ఒక్క దువ్వాడ శ్రీనివాస్ తప్ప ఎవరూ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget