Gen Z Politics AP Telangana: జెన్ జీ జపం.. వర్కవుట్ అవ్వని కేటీఆర్, వైసీపీ వ్యూహాలు! తెలుగు రాష్ట్రాల్లో యువత ఎందుకు సైలెంట్?
YSRCP Gen Z Tag: ఏపీ, తెలంగాణల్లో జెన్ జీ పేరుతో రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం ఎందుకు విఫలమవుతోంది? జెన్‌జీని రోడ్ల మీదకు తీసుకు రావాలనుకున్న కేటీఆర్, జగన్ ప్రయత్నాలు విఫలమయ్యాయా?

Telugu Youth Political Mindset: ఆధునిక రాజకీయాల్లో జెన్ జీ ఓటర్లు అత్యంత కీలకమైన శక్తిగా మారుతున్నారు. జెన్ జీ వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాలను గడగడలాడించిన దృశ్యాలను చూసి, తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు కూడా ఈ తరాన్ని తమవైపు తిప్పుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, గడిచిన కొద్దికాలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. పార్టీలు ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న జెన్ జీ కార్డు క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రభావం చూపలేకపోతోంది
తెలంగాణలో కేటీఆర్ పొలిటికల్ గేమ్ ఎందుకు ఫెయిలైంది?
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా జెన్ జీ ఆధారిత ప్రచారాన్ని తీవ్రంగా నడిపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ చదువుల్ని క్రిమినల్ వేస్ట్ అని సంబోధించడంతో యువ ఇంజనీర్లందర్నీ అలా అన్నారని కేటీఆర్ క్యాంపెయిన్ చేశారు. క్రిమినల్ వేస్ట్ , అన్ ఫిట్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్ కల్చర్‌తో యంగ్ ఓటర్లను ఆకట్టుకోవాలని చూశారు. అయితే, ఈ మీమ్స్ సోషల్ మీడియాలో ఎంటర్‌టైన్‌మెంట్‌గా మాత్రమే మిగిలిపోయాయి తప్ప, నిరుద్యోగ యువతను లేదా కాలేజీ విద్యార్థులను రోడ్లపైకి తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాస్ ప్రొటెస్ట్‌గా మార్చడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది.
ఏపీలో వైసీపీ ఓన్ కేడర్ కే జెన్ జీ ట్యాగ్
ఇక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరోలా ఉంది. వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని పునర్నిర్మించే క్రమంలో యువతను ఆకట్టుకునేందుకు వినూత్నంగా ప్రయత్నించింది. అయితే, నిజమైన తటస్థ జెన్ జీ యువతను భాగస్వాములను చేయడం కంటే, ఇప్పటికే పార్టీలో ఉన్న తమ అనుబంధ విద్యార్థి విభాగం, ఐటీ సెల్ కార్యకర్తలకే జెన్ జీ అనే కొత్త ల్యాబెల్ వేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించడం కనిపించింది. డీఎస్సీ పోరాటాల్లో ఈ పద్దతి ఎక్కువగాఉంది. కేవలం పార్టీ ప్రచార పత్రాలు పట్టుకుని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్‌లలో హల్‌చల్ చేయడం వల్ల అది కేవలం ఆర్గనైజ్డ్ పార్టీ ప్రచారంగానే మిగిలిపోయింది తప్ప, ఏపీలోని సాధారణ యువతలో ఎలాంటి పొలిటికల్ అప్‌రైజింగ్‌ను తీసుకరాలేకపోయింది.
నిజంగా తెలుగు జెన్ జీ రోడ్ల మీదికి ఎందుకు రావడం లేదు?
తెలుగు యువతలో అత్యధిక శాతం మంది ఐటీ ఉద్యోగాలు, యూఎస్/యూకే ఉన్నత చదువులు, గ్రూప్స్. సివిల్స్ , ఇతర ప్రభుత్వ ఉద్యోగాల సాధనలోనే నిమగ్నమై ఉన్నారు. డిజిటల్ స్పేస్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచినా, రోడ్లెక్కి నిరసన తెలిపితే నమోదయ్యే క్రిమినల్ కేసులు తమ భవిష్యత్తు, వీసా అవకాశాలను దెబ్బతీస్తాయనే హెచ్చరిక వారిని వెనక్కి లాగుతోంది. నేటి తరం రాజకీయ వ్యతిరేకతను లేదా మద్దతును రీల్స్, మీమ్స్, ఎక్స్ , స్పేసెస్, డోపమైన్ ఇచ్చే డిజిటల్ కంటెంట్ రూపంలోనే చూపిస్తోంది. వీధి పోరాటాల కంటే డిజిటల్ ట్రోలింగ్‌నే వారు సౌకర్యవంతమైన యాక్టివిజంగా భావిస్తున్నారు.
పార్టీల సింథటిక్ వ్యూహాలు, జెన్ జీ డిస్‌కనెక్ట్
రాజకీయ పార్టీలు జెన్ జీ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో పొరబడుతున్నాయి. నాయకులు వేసే మీమ్స్ లేదా వాడే జార్గన్స్ చూసి తమను వారు ప్రతిబింబిస్తున్నారని యువత భావించడం లేదు. పార్టీలు ప్రదర్శించే ప్రచా కృత్రిమమైనది గా ఉండటంతో యువత సులభంగా గుర్తిస్తోంది. ఉపాధి అవకాశాలు, క్వాలిటీ ఎడ్యుకేషన్, గిగ్ ఎకానమీ కార్మికుల సమస్యలు, స్టార్టప్ ఈకోసిస్టమ్, ప్రాజెక్టుల పురోగతి వంటి నిజమైన ఎజెండా వదిలేసి.. కేవలం వ్యక్తిగత దూషణలు, రాజకీయ ట్రోలింగ్ చుట్టూ తిరిగే కంటెంట్‌ను జెన్ జీ లైట్ తీసుకుంటోంది.
భవిష్యత్తు ఓటింగ్ ట్రెండ్ ఏంటి?
రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయనంత మాత్రాన తెలుగు జెన్ జీకి రాజకీయ స్పృహ లేదనుకోవడం పార్టీల పెద్ద పొరపాటే అవుతుంది. వారు నిశ్శబ్దంగా గమనించే సైలెంట్ ఓటర్లు . బూత్ లెవల్‌కి వచ్చి ఓటు వేసే సమయంలో సాంప్రదాయ కుల, ప్రాంతీయ సమీకరణల కంటే.. వ్యక్తిగత స్వాతంత్య్రం, ఉద్యోగ కల్పన, పారదర్శక పాలన అందించే నాయకులకే ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ తమ సొంత ప్రయోజనాల కోసం తమను పొలిటికల్ టూల్ గా వాడుకోవాలని చూస్తే తిరస్కరించడంలో ఈ తరం ముందే ఉంటుంది. నాయకులు కేవలం మీమ్స్‌కే పరిమితం కాకుండా, వారి భవిష్యత్తుకు భరోసానిచ్చే విజన్‌ను చూపినప్పుడే ఈ తరం ఓటర్లు నిజమైన మద్దతుదారులవుతారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















