8 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఈ సమస్యలు తప్పవు

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రతిరోజూ 8 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల మీ శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లభించదు

Image Source: pexels

దీర్ఘకాలం పాటు తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది

Image Source: pexels

నిద్ర లేకపోవడం వల్ల రోజంతా అలసటగా, కొన్ని సందర్భాల్లో చిరాకు అనిపించవచ్చు

Image Source: pexels

రెగ్యూలర్‌గా తక్కువ గంటలు నిద్ర తీసుకోవడం వల్ల మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం పడవచ్చు

Image Source: pexels

నిద్రలేమి వల్ల ఊబకాయం, బరువు పెరగడం వంటి చాలా ప్రమాదాలతో కూడా ముడిపడి ఉంటుంది

Image Source: pexels

దీర్ఘకాలికంగా సరిగా నిద్రపోని అలవాటు కారణంగా బీపీ పెరిగి గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది

Image Source: pexels

తక్కువ నిద్ర పోయేవారిలో టైప్2 డయాబెటిస్ ముప్పు పెరిగే అవకాశంఉంది.

Image Source: pexels

ప్రతి వ్యక్తికి నిద్రించే గంటలు భిన్నంగా ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ 8 గంటలు నిద్ర సెట్ కాదు. 6 గంటలు కూడా సరిపోయే వాళ్లు ఉంటారు

Image Source: pexels

మంచి నిద్ర కోసం ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయానికి నిద్రపోవాలి, ఒకే టైంలో మేల్కొనడానికి ప్రయత్నించండి

Image Source: pexels