అన్వేషించండి

AP BJP : వీర్రాజుపై హైకమాండ్‌కు ఫిర్యాదులు - కొత్త నేత కావాలని విజ్ఞప్తులు !

సోము వీర్రాజుపై ఏపీ బీజేపీ నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. కొత్త నేతను నియమించాలంటున్నారు.

AP BJP :  మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ వ్యక్తం చేసిన అసంతృప్తి ఏపీ బీజేపీలో అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే ఎవరూ బయట మీడియాతో మాట్లాడవద్దని స్పష్టమని ఆదేశాలు రావడంతో అందరూ అంతర్గతంగా తన అసంతృప్తిని మీడియాకు వెల్లడిస్తున్నారు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉంటే కష్టమని ఆయనను తక్షణం తొలగించాలన్న డిమాండ్‌ను హైకమాండ్ ముందు ఉంచుతున్నారు. ఇటీవల సోము వీర్రాజును మారుస్తారని ప్రచారం జరిగింది. సీనియర్ నేత సత్యకుమార్ లేదా మరో యువనేతకు చాన్సిస్తారని అనుకున్నారు.కానీ మూడు రోజుల కిందట సోము వీర్రాజు నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్ ప్రకటించడంతో పార్టీలో కలకలం ప్రారంభమయింది. 

బీజేపీని రెండు వర్గాలుగా మార్చేశారని సోముపై విమర్శలు

సోము వీర్రాజు బీజేపీని సరిగ్గా నడపడం లేదని.. ఉన్న పార్టీనే రెండు వర్గాలుగా మార్చేసుకుని ఓ వర్గానికి నేతగా చెలామణి అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పార్టీలో చేరిన వాళ్లను అసలు ఎప్పుడూ పట్టించుకోలేదు. అదే సమయంలో తన వర్గం కాదు అనుకున్న కొంత మంది నేతలకూ గుర్తింపు లేకుండా పోయింది. సోము వీర్రాజుతో పాటు ఆయనకు సన్నిహితులుగా ఉండేవారే పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతూ వస్తున్నారు. ఇది ఇతర నేతల్లో అసంతృప్తికి కారణం అయింది. సోము వీర్రాజు పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. తాజాగా ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు. 

సత్యకుమార్‌ను ఏపీ బీజేపీ చేయాలని కొంత మంది నేతల విజ్ఞప్తులు

జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు. మూడు నెలల కిందట విజయవాడలో సోము వీర్రాజు నాయకత్వాన్ని వ్యతిరేకించేవారంతా విందు  భేటీ పేరుతో రహస్యంగా సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో సత్యకుమార్ ను .. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టాలని నేతలు కోరారు. వారంతా తమ అభిప్రాయాల్ని బీజేపీ హైకమాండ్‌కు  పంపుతామన్నారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి సోము వీర్రాజును మార్చేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. సోము వీర్రాజు తీరుపై హైకమాండ్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయనను మార్చకపోతే పార్టీలో కొనసాగడం కష్టమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. 

పార్టీలో చేరిన వారిని దూరం పెట్టిన సోము వీర్రాజు 

సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా కొంత మంది నేతల్ని సస్పెండ్ చేశారు. లంక దినకర్, ఓవీ రమణ  వంటి నేతలను బయటకు పంపారు.కొన్నాళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేశారు. ఇప్పటికీ వారికి ప్రాధాన్యం లభించడం లేదు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీలో చేరే వారితో పార్టీని బలపర్చుకుంటూ ఉంటే.. ఏపీలో మాత్రం..  పార్టీలో చేరిన వారందర్నీ కోవర్టు ముద్ర వేసి.. పక్కన పెట్టారని అంటున్నారు. మొత్తంగా సోము వీర్రాజుపై ఇప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికలకు ఏపీలో తానే సారధ్యం వహించాలని ఆయన అనుకుంటున్నారు. సునీల్ ధియోధర్, జీవీఎల్ వంటి వారి సపోర్ట్ ఉన్నా..  ఆ కోరిక తీరుతుందో లేదో చెప్పడం కష్టంగా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget