Ambati On Puvvada : భద్రాచలం మాదే ఇచ్చేస్తారా ? పువ్వాడకు అంబటి కౌంటర్
భద్రాచలాన్ని ఏపీకి ఇచ్చేస్తారా అని మంత్రి పువ్వాడకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ఎత్తుపై వివాదం సృష్టించడం తగదన్నారు.
Ambati On Puvvada : పోలవరం ఎత్తుపై కొత్త వివాదాన్ని సృష్టించొద్దని మంత్రి అంబటి రాంబాబు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కు విజ్ఞప్తి చేశారు. పోలవరంతోనే భద్రాచలం మునిగిపోయిందనడం కెరెక్ట్ కాదన్నారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అన్ని అంశాలు పరిశీలించాకే పోలవరానికి అనుమతులు వచ్చాయన్నారు. పోలవరం ముంపు ఉంటుందనే 7 మండలాలను ఏపీలో కలిపారని గుర్తుచేశారు.
పువ్వాడని తన సంగతేంటో చూసుకోమనండి, ఉమ్మడి రాష్ట్రం కావాలని మేమూ డిమాండ్ చేస్తాం: బొత్స
తెలుగు రాష్ట్రాల మధ్య అనవసర వివాదాలు సృష్టించొద్దన్న అంబటి రాంబాబు
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరికాదని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సీడబ్ల్యూసీ అనుమతితోనే నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు. వరదల సమయంలో రాజకీయాలు తగవని మంత్రి అంబటి హితవు పలికారు. పువ్వాడ అజయ్ తండ్రి గతంలో తన సహచర ఎమ్మెల్యే అన్న అంబటి రాంబాబు.. తెలంగాణ మంత్రితోనూ తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. తెలంగాణ, ఆంధ్ర మధ్య విబేధాలు సమసిపోయాయని.. అనవసర వివాదాలు సృష్టించొద్దని ఆయన హితవు పలికారు.
గతంలోనూ భద్రాచలానికి వరదలు వచ్చాయనే విషయాన్ని గుర్తు చేసిన అంబటి రాంబాబు.. 1986 భద్రాచలం వద్ద దాదాపు 76 అడుగులు వరద వచ్చింది. అప్పుడు భద్రాచలం మునగలేదా..? అని ప్రశ్నించారు. పోలవరం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అన్న అంబటి.. కేంద్రం ప్రతి క్షణం ఈ ప్రాజెక్టును పరిశీలిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు ఉంటే కేంద్రం వద్దే తేల్చుకోవాలని ఆయన తెలంగాణ నేతలకు సూచించారు.
జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు మరో షాక్! ఆ పిటిషన్ కొట్టివేత, ఈయనకు గొప్పఊరట
భద్రాచలం ఏపీదే తిరిగి ఇచ్చేస్తారా ?
పువ్వాడ అజయ్ కుమార్ 5 గ్రామాలు ఇచ్చేయాలని అంటున్నారని.. భద్రాచలం ఇవ్వాలని అడిగితే ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు. ఏదైనా సమస్య ఉంటే కేంద్రంతో మాట్లాడాలని గానీ, ఇలా వివాదం చేయకూడదని సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ అవసరం లేదని, అందరం కలిసి మెలసి ఉండాల్సిన వాళ్లమని తెలిపారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అనవసరమైన వివాదాలు ఎందుకని అంబటి ప్రశ్నించారు.