ఔటర్ రింగ్ రోడ్డుకు ఎల్‌ఈడీ కాంతులు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రోడ్డు ప్రమాదాల నివారణకు136 కిలోమీటర్ల మేర లైటింగ్ ఏర్పాటు చేశారు.
రూ. 100 కోట్లతో ఓఆర్ఆర్ విద్యుద్దీకరణ ప్రాజెక్టు చేపట్టి పూర్తి చేశారు. ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ పద్ధతిలో కాంట్రాక్టర్ రిమోట్ ద్వారా ఆపరేటింగ్ చేస్తూ, ఏడేళ్లు లైటింగ్ నిర్వహణను కొనసాగిస్తారు.
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఓఆర్ఆర్ ఎల్‌ఈడీ లైటింగ్ గురువారం రాత్రి ప్రారంభమైంది. ప్రమాదరహిత రహదారిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
ఎల్‌ఈడీ లైట్ల కాంతులు జిగేల్ మంటూ వాహనదారులు, ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ప్రమాదాలు తగ్గుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎల్‌ఈడీ లైట్లు ఎంతో ఉపయోగకరంగా మారతాయని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ఔటర్ రింగురోడ్డును 2010లో ప్రారంభించారు.
ఓఆర్ఆర్ ప్రారంభమయ్యాక హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విలువ పెరిగింది. భూముల ధరలు కొండెక్కాయి.
సంగారెడ్డిలోని ఐడీఏ బొల్లారం నుంచి కొల్లూరు వరకు 25 కిలోమీటర్ల వరకు రింగురోడ్డు ఈ జిల్లా పరిధిలో ఉండటంతో ప్రయాణం సులభతరమైంది..
పటాన్‌చెరు జంక్షన్‌కు కిలోమీటర్ ముందు ఈ ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభించారు. మొత్తంగా ఔటర్ రింగురోడ్డుపై 25 కిలోమీటర్ల వరకు ఎల్‌ఈడీ లైట్లు వెలుగులు నింపనున్నాయి.
image 10
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
Republic Day Celebrations 2023: రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - జెండా ఎగుర వేసిన గవర్నర్
KCR Chadar To Ajmer Dargah: అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం కేసీఆర్
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్
Pawan Kalyan : కొండగట్టు అంజన్న సన్నిధిలో అంజనీ పుత్రుడు, వారాహికి ప్రత్యేక పూజలు
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!