అన్వేషించండి
In Pics : భద్రాద్రి రామాలయాన్ని చుట్టుముట్టిన గోదారమ్మ, చరిత్రలో రెండో సారి వంతెనపై రాకపోకలు బంద్!

భద్రాచలం రామాలయాన్ని చుట్టుముట్టిన వరద
1/13

భద్రాచలం వద్ద గోదావరి నదికి భారీగా వరద పోటెత్తుతోంది.
2/13

భద్రాచలం వద్ద గోదావరిలో 19.04 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది.
3/13

ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
4/13

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం సాయంత్రం 5 గంటలకు 61.80 అడుగులకు చేరుకుంది.
5/13

1976 నుంచి నది 60 అడుగుల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదోసారి అని అధికారులు తెలిపారు.
6/13

వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సాయంత్రం 5 గంటల నుంచి వంతెనపై రాకపోకలు నిలిపేశారు.
7/13

భారీ వరద నేపథ్యంలో వంతెనపై రాకపోకలు నిలిపివేయడంతో పాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు.
8/13

భద్రాచలం వంతెన చరిత్రలో రాకపోకలు నిలిపివేయడం ఇది రెండోసారిగా తెలుస్తోంది.
9/13

1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరిన సమయంలో వంతెనపై రాకపోకలను నిలిపివేశారు.
10/13

మళ్లీ 36 సంవత్సరాల తర్వాత భారీగా వరద వస్తుండడంతో అధికారులు రాకపోకలపై ఆంక్షలు విధించారు.
11/13

గురువారం సాయంత్రం 5 గంటల నుంచి గోదావరి వంతెనపై ఆంక్షలు అమలులోకి రాగా 48 గంటల పాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలు ఆగిపోయాయి.
12/13

భద్రాచలం వద్ద ఉగ్రగోదావరి
13/13

ముంపులో గోదావరి పరివాహక ప్రాంతాలు
Published at : 14 Jul 2022 07:29 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
ఇండియా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion