అన్వేషించండి
రిషబ్ పంత్ కంటే ఘోర ప్రమాదం, నికోలస్ పూరన్ ఆక్సిడెంట్ గురించి తెలుసా మీకు
Nicholas Pooran Rishabh Pant Accident: భారత ఆటగాడు రిషబ్ పంత్ , వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ ఇద్దరికీ ఒక పోలిక ఉంది. ఇద్దరూ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అసలే జరిగింది అంటే..

నికోలస్ పూరన్, రిషబ్ పంత్
1/7

భారత ఆటగాడు రిషబ్ పంత్ లాగానే, వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ కూడా కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
2/7

ప్రపంచంలోని బలమైన బ్యాట్స్‌మెన్‌లలో నికోలస్ పూరన్ ఒకరు. అద్భుతమైన సిక్సర్లు కొట్టడంలో పేరున్న నికోలస్ కొన్నేళ్ల క్రితం ఘోర ప్రమాదానికి గురయ్యాడు.
3/7

నిజానికి 2015 జనవరిలో ట్రినిడాడ్లో జరిగిన కారు ప్రమాదంలో 19 ఏళ్ల పూరన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ ప్రమాదం తర్వాత.. అతను క్రికెట్‌ను వదులుకోవాలని.. అప్పుడే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ సలహా ఇచ్చాడు.
4/7

పూరన్ కాలు నిటారుగా లేకపోవడంతో సుమారు 18 నెలలు వీల్ చైర్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. లేచి నిలబడటం కోసం 6 నెలల్లో 2 శస్త్రచికిత్సలు చేయించుకోవలసి వచ్చింది. గాయం తర్వాత మరుసటి సంవత్సరం వెస్టిండీస్ తరఫున అతను అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
5/7

నికోలస్ పూరన్ గాయం సమయం నుంచి కొలుకొనే సమయంలో అతని గర్ల్ ఫ్రండ్ అతనికి తోడుగా నిలబడింది. నికోలస్ పూరన్ 2020 సంవత్సరంలో ఎలిస్సా మిగుల్ ను వివాహం చేసుకున్నాడు.
6/7

నికోలస్ పూరన్ గాయం ఇప్పుడు మరోసారి వార్తల్లో ఉండటానికి కారణం ఏంటంటే తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ సెంచరీ తో వార్తల్లోకి ఎక్కడమే. మాజీ ఆటగాళ్ళు సైతం రిషబ్ ను మిరాకిల్ మ్యాన్ అంటున్నారు.
7/7

డిసెంబర్ 2022లో జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. నికోలస్ పూరన్, రిషబ్ పంత్ వాస్తవానికి ఒకే దశ నుంచి బయటపడ్డారు. అయితే క్రికెట్ ఆడాలనే వారి మొండి పట్టుదల వారిని తిరిగి మైదానంలోకి తీసుకువచ్చింది.
Published at : 25 Sep 2024 03:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
హైదరాబాద్
టీవీ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion