టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే భారీగా ప్రాణ నష్టం సంభవించగా.. మృతుల సంఖ్య 2300కు చేరుకుంది.(Image Source: AP)
ఆగ్నేయ టర్కీ ప్రాంతంలో, ఉత్తర సిరియాలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8 గా నమోదు అయింది. (Image Source: AP)
భూకంప తీవ్రతకు భారీ భవనాలు నిమిషాల్లో నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని, మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. (Image Source: AP)
టర్కీలోని 10 నగరాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉంది. ఈ భూకంపం కారణంగా వందలాది మంది చనిపోగా, వేలాది మంది గాయపడ్డారు. (Image Source: AP)
టర్రీ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. (Image Source: AP)
ఆగ్నేయ టర్కీలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. (Image Source: AP)
దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం ఎక్కువగా ఉంది. టర్కీలోని దియర్‌బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. (Image Source: AP)
తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో 20 సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. (Image Source: AP)
ప్రపంచ దేశాల్లోని ప్రజలు టర్కీ కోలుకోవాలని ప్రార్థనాలు చేస్తున్నారు
సిరియాలోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాలు, రెబల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో 783 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. (Image Source: AP)
భవనాల శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.(Image Source: AP)
టర్కీలోని 10 ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించింది. ఇప్పటివరకు 2300 మంది మరణించినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. 5300 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రతతో టర్కీలో దాదాపు 3 వేల భవనాలు ధ్వంసమయ్యాయి. (Image Source: AP)
సోమవారం తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ పెను ప్రమాదం జరిగింది. (Image Source: AP)
టర్కీ, సిరియా దేశాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు
World's Most Expensive School: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠశాల, ఏడాదికి కోటి పైనే ఫీజు!
Tangmarg Waterfall: నీళ్లు మంచుగా మారిన వేళ - తంగ్ మర్గ్ జలపాతానికి పోటెత్తిన పర్యాటకులు
KTR Davos: మంత్రి కేటీఆర్‌కు స్విట్జర్లాండ్‌లో ఘన స్వాగతం
China Corona Cases: మెడికల్ షాపుల బయట క్యూ లైన్లు- చైైనాలో కరోనా చిత్రాలు ఇవే!
Sundar Pichai: ప్రపంచంలో ఏ మూలకెళ్లినా నేను భారతీయుడినే - పద్మ భూషణ్ స్వీకరించిన సుందర్ పిచాయ్
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్