అన్వేషించండి
New Intelligence : భవిష్యత్తును మార్చేయనున్న కొత్త సాంకేతికత.. AIని కూడా మించేస్తుందట
Synthetic Intelligence vs Artificial Intelligence : గత కొన్నేళ్లుగా కృత్రిమ మేధస్సు సాంకేతిక ప్రపంచంలోనే అతిపెద్ద చర్చనీయాంశంగా ఉంది. అయితే దీనిని మించిన సాంకేతికత వచ్చింది.
సింథటిక్ ఇంటెలిజెన్స్
1/6

సింథటిక్ ఇంటెలిజెన్స్ అంటే SI టెక్నాలజీ. ఇది కేవలం డేటా ప్రాసెసింగ్ లేదా ప్రోగ్రామింగ్కు పరిమితం కాదు. ఇందులో మనుషుల్లాంటి అవగాహన, ఆలోచించే శక్తి, సృజనాత్మకత ఉంటాయి. సాధారణ భాషలో చెప్పాలంటే.. ఇది నేర్చుకున్న సమాచారంపై మాత్రమే పని చేయదు. కొత్త పరిస్థితులను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోగలదు. అందుకే దీనిని AI కంటే చాలా శక్తివంతమైనదిగా భావిస్తున్నారు.
2/6

AI,SI రెండుంటినీ పోల్చి చూస్తే.. తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు AI, SIలు చదరంగం ఆడితే AI నియమాలు, పాత ఆటల డేటా ఆధారంగా మాత్రమే ఆడుతుంది. SI నియమాలను అర్థం చేసుకోవడమే కాకుండా.. ప్రత్యర్థి ఆటగాడి వ్యూహాన్ని, ఊహించని ఎత్తులను కూడా వెంటనే పసిగట్టి ఆటను సర్దుబాటు చేసుకుంటుంది. దీనిని బట్టి ఆలోచిస్తే SI కేవలం యంత్రంలా ఆదేశాలను పాటించే వ్యవస్థ కాదని.. మానవుల్లా ఆలోచించే, నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని స్పష్టమవుతుంది.
3/6

SI కేవలం ఆదేశాలను అంచనా వేయడమే కాదు.. పరిస్థితిని అర్థం చేసుకుని.. వేరే మార్గం చూస్తుంది. ఉదాహరణకి "నేను దరిద్రుడిని" అని అంటే.. ఏఐ ఇది ఒక నిజాన్ని సిద్దంగా తీస్తుంది. కానీ ఎస్‌ఐ సందర్బాన్ని అర్ధం చేసుకుంటుంది. ఇది వినోదమా, వ్యంగ్యమా లేదా నిజమా అని కూడా గుర్తిస్తుంది.
4/6

అంతేకాకుండా AI పాత నమూనాలు, డేటా ఆధారంగా కంటెంట్ను మాత్రమే తయారు చేయగలదు. SI పూర్తిగా కొత్త, ప్రత్యేకమైన విషయాలను సృష్టించగలదు. సరికొత్త డిజైన్లు, కథలు లేదా వినూత్న ఆలోచనలు ఇవ్వడం చేస్తుంది.
5/6

SI ని సరిగ్గా అభివృద్ధి చేస్తే.. యంత్రాలు మానవుల ఆలోచన, పనితీరు కంటే వేగంగా వర్క్ చేస్తుందని అనేక నివేదికలు అని పేర్కొన్నాయి. అంటే ఈ సాంకేతికత పనిని సులభతరం చేయడమే కాకుండా.. అనేక సందర్భాల్లో మానవుల కంటే ముందు కూడా ఉండవచ్చు.
6/6

నేడు ప్రపంచమంతా కృత్రిమ మేధస్సు (AI)పై ఫోకస్ చేస్తుండగా.. సింథటిక్ ఇంటెలిజెన్స్ (Synthetic Intelligence) నిశ్శబ్దంగా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇది రాబోయే కాలంలో యంత్రాలు, మానవుల మధ్య సంబంధాన్ని పూర్తిగా మార్చే ఒక సాంకేతిక మైలురాయిగా మారనుంది.
Published at : 16 Sep 2025 06:22 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















