అన్వేషించండి
Study Tips to Avoid Sleep : చదువుకునేప్పుడు నిద్రరాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ఈ టిప్స్ ఫాలో అయిపోండి
చాలామందికి చదువుకునేప్పుడు నిద్ర వస్తుంది. పిల్లలు అలా చదువుకునేప్పుడు నిద్ర రాకుండా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
చదివేప్పుడు నిద్ర రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే (Images Source : Envato)
1/7

పిల్లలైనా, పెద్దలైనా చదువుకునేప్పుడు నిద్ర అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా చదివేప్పుడు అలెర్ట్‌గా ఉంటూ చదువుపై ఫోకస్ చేయాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం.
2/7

చదువుకోవాలనుకుంటే పడుకొని లేదా జారబడి చదువుకోకూడదు. కుర్చీలో లేదా టేబుల్‌పై నిటారుగా కూర్చొని, సరైన భంగిమలో కూర్చుంటే మంచిది.
3/7

పోమోడోరో టెక్నిక్ ఫాలో అవ్వాలి. అంటే 25 నిమిషాలు చదివి 5 నిమిషాలు బ్రేక్ తీసుకుంటే మంచిది. బ్రేక్ సమయంలో శరీరాన్ని స్ట్రెచ్ చేయడం, వాకింగ్ చేయడం వంటివి చేస్తే నిద్ర రాకుండా ఉంటుంది.
4/7

ముఖాన్ని చల్లని నీటితో కడగడం, లేదా కళ్లపై ప్రెజర్‌ని ఇచ్చేలా నీటిని చిమ్మడం చేయాలి. ఇది నిద్రను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. మైండ్‌ని వెంటనే యాక్టివ్ చేస్తుంది.
5/7

చదివేప్పుడు నీటిని తాగుతూ ఉండాలి. ఇది హైడ్రేటెడ్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. డీహైడ్రేషన్ ఉంటే నీరసంగా అనిపించి నిద్ర వచ్చే అవకాశం ఎక్కువ.
6/7

హెవీ ఫుడ్స్ చదివే ముందు తినకపోవడమే మంచిది. హెల్తీ స్నాక్స్ తినాలి. నట్స్, పండ్లు, డార్క్ చాక్లెట్స్ వంటివి తింటే మంచిది.
7/7

చదివే రూమ్‌లో లైట్ ఎక్కువగా ఉండాలి. లైట్ తక్కువగా ఉంటే నిద్ర వస్తుంది. కాబట్టి లైట్ వేస్తే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది.
Published at : 24 Jun 2025 02:09 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















