అన్వేషించండి
Brahmamudi Serial Today December 04 Highlights : పురుష అహంకారంతో చెలరేగిపోతున్నరాజ్.. ఇంట్లో అడుగుపెట్టిన కావ్య - బ్రహ్మముడి డిసెంబరు 04 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: కావ్య విషయంలో తగ్గేదేలే అంటాడు రాజ్... ఎందుకు తగ్గవో చూస్తానంటుంది తల్లి అపర్ణ...ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today December 04 Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9

కొడుకులో మార్పుకోసం అపర్ణ విడాకుల నోటీసులు పంపించడంతో కావ్యపై ఫైర్ అవుతాడు రాజ్. ఇంటికెళ్లిన కావ్య..అత్తయ్యని, కనకాన్ని కలిపి దులిపేస్తుంది. ఆ తర్వాత మీరు ఇంట్లోంచి వెళ్లిపోండి అంటుంది కావ్య. ఏం జరిగినా నేను చూసుకుంటాను నీకెందుకు వదిలెయ్ అంటుంది అపర్ణ.
2/9

మరోవైపు రాజ్ తల్లిదండ్రుల ఫొటోస్ చూస్తూ బాధపడతాడు..నేను బతికి ఉండగా మిమ్మల్ని విడిపోనివ్వను ఈ కుటుంబాన్ని ముక్కలు కానివ్వను అంటాడు. ఆ తర్వాత ఓ వ్యక్తికి కాల్ చేసి డాక్యుమెంట్స్ రెడీ చేశారా అని అడుగుతాడు.
3/9

పూజ చేసిన తర్వాత అపర్ణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది కావ్య..నీకు రాజ్ కు మధ్య దూరం తొలగి సంతోషంగా ఉండాలంటుంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన రాజ్.. నువ్వేం చేశావ్ అంటూ తల్లిపై ఫైర్ అవుతాడు. ఆ తర్వాత మన విడాకుల పేపర్స్ అంటూ రాజ్ కావ్య చేతిలో పెడతాడు.
4/9

రాజ్ తరపున నేను నీ కాళ్లు పట్టుకుంటా అనగానే కావ్య అంతమాట అనొద్దంటుంది. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మీ నీడలో మీ మనవరాలిగా బతికే భాగ్యం దొరికినందుకు సంతోషంగా ఉంది అంటుంది. మీరు ఇచ్చిన స్ఫూర్తితో నా కాపురం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తాను అంటుంది.
5/9

నీ నిర్ణయం వెనక్కు తీసుకుని ఇంటికిరా..నీ కోడలే ముఖ్యం అని పంతానికపోతే జీవితంలో అది నెరవేరదని తేల్చి చెప్పేస్తాడు. నాతో నువ్వు మాత్రమే రావాలని కండిషన్ పెడతాడు. రాజ్ మాటలు విని కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.
6/9

అమ్మా నీకు 5 మినిట్స్ టైమ్ ఇస్తున్నా అన్న మాటలు విని అప్పుడే ఎంట్రీ ఇచ్చిన సీతారామయ్య రాజ్ చెంప పగలగొడతాడు. నీ తల్లికా నువ్వు టైమ్ ఇచ్చేది? నీ భార్య సహనాన్ని అహంకారంతో బలిచేసే హక్కు నీకెవరిచ్చారని నిలదీస్తాడు. ఈ వంశంలో ఇలాంటి భ్రష్టుడు పుడతాడు అనుకోలేదంటాడు. కావ్య ఏం చేసిందో ఆమె కళ్లలోకి చూసి చెప్పు అని నిలదీస్తుంది ఇందిరాదేవి.
7/9

ఎవరు ఏమనుకున్నా కావ్య నాకు భగవంతుడు ఇచ్చిన మనవరాలు..ఇంటి వారసులురాలు అని సీతారామయ్య చెబుతాడు. ఎవరికి నచ్చినా లేకున్నా కావ్య దుగ్గిరాల ఇంటి కోడలిగా శాశ్వతంగా మనింట్లోనే ఉంటుందని ప్రకటిస్తాడు. కనకం, కృష్ణమూర్తి కృతజ్ఞతలు చెబుతారు.
8/9

ఏ ధైర్యంలో ఇంటికి రావాలని కావ్య అంటే.. తనమనసులో నీపై ప్రేమ లేకపోతే మరో వ్యక్తికి నిన్ను ఇచ్చి పెళ్లి చేసేవారం..కానీ వాడి ప్రేమను మబ్బులు కమ్మేశాయ్...నీ సహనమే వాడిలో మార్పు తీసుకొస్తుందని సీతారామయ్య అంటాడు. నువ్వు ఇల్లు దాటిపోగానే వెలుగుపోయిందని బాధపడతారు.
9/9

బ్రహ్మముడి డిసెంబరు 05 గురువారం ఎపిసోడ్ లో ధాన్యలక్ష్మి రచ్చ సీరియల్ ని మలుపు తిప్పే సీన్ కాబోతోంది. ఆత్మహత్య చేసుకుంటానని ధాన్యలక్ష్మి బెదిరిస్తుంది..సీతారామయ్య కుప్పకూలిపోతాడు..
Published at : 04 Dec 2024 09:27 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
గాసిప్స్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion