అన్వేషించండి
నాగభూషణం మనవడు హీరోగా 'మిస్టీరియస్'... టైటిల్ పోస్టర్ లాంచ్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి
ఒకప్పటి ప్రముఖ నటులు 'రక్త కన్నీరు' నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోగా పరిచయం అవుతున్నారు. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో 'మిస్టీరియస్' చేస్తున్నారు. ఆ మూవీ టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు.
నాగభూషణం మనవడు హీరోగా 'మిస్టీరియస్'... టైటిల్ పోస్టర్ లాంచ్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి
1/4

ఈతరం ప్రేక్షకులకు నాగభూషణం తెలిసే అవకాశాలు తక్కువ. ఓ రెండు తరాలు ముందుకు వెళితే... ఆయన అంటే తెలియనివారు ఉండరు. 'రక్త కన్నీరు'తో పాపులరైన నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'మిస్టీరియస్' (MissTerious)లో ఆయన నటించారు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. 'బిగ్ బాస్' ఫేమ్ రోహిత్ సహాని ప్రధాన పాత్రలో రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు.
2/4

ఆష్లీ క్రియేషన్స్ పతాకం మీద ఉషా, శివాని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం సౌండ్ ఫైనల్ మిక్సింగ్ జరుగుతున్నాయిని, త్వరలో ఆడియో విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.
3/4

టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... ''దక్షిణాది భాషలు అన్నిటిలో చేస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి'' అని బెస్ట్ విషెస్ చెప్పారు. దర్శకుడు మహి కోమటి రెడ్డి మాట్లాడుతూ... ''ఈ సినిమాలో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉంటుంది. ఇదొక సస్పెన్స్ మిస్టరీ. ఇందులో షాకింగ్ ట్విస్టులు కథను థ్రిల్లింగ్ గా ముందుకు తీసుకు వెళతాయి. టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి థాంక్స్'' అని చెప్పారు.
4/4

నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ... ''స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి సన్నివేశంలో ఉత్కంఠ ఇచ్చే చిత్రమిది. విజన్ ఉన్న దర్శకుడు మహి కోమటిరెడ్డితో పని చేయడం సంతోషంగా ఉంది. ప్రతి వారం ఒక పాట విడుదల చేస్తాం'' అని అన్నారు. రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్), అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజపుత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బలరాజ్ వాడి (కన్నడ నటుడు), ఆకునూరి గౌతమ్, భోగి రెడ్డి శ్రీనివాస్, రాజమౌళి (జబర్దస్త్), గడ్డం నవీన్ (జబర్దస్త్), లక్ష్మీ, వేణు పోల్సాని ఇతర ప్రధాన తారాగణం.
Published at : 17 Jun 2025 04:43 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















