అన్వేషించండి
Prudhvi Raj: కృష్ణ అభిమాని సినిమాలో '30 ఇయర్స్' పృథ్వీ, ప్రేమ... ఏ సినిమా అది? రిలీజ్ ఎప్పుడు?
Jewel Thief Movie Release Date: సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని కృష్ణ సాయి హీరోగా రూపొందిన 'జ్యువెల్ థీఫ్' సినిమాలో '30 ఇయర్స్' పృథ్వీ ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమా రిలీజ్ డేట్ ఖరారు అయ్యింది.
కృష్ణ అభిమాని కృష్ణ సాయి హీరోగా నటించిన సినిమా విడుదల రెడీ
1/5

సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని వీరాభిమాని కృష్ణ సాయి హీరోగా రూపొందిన సినిమా 'జ్యువెల్ థీఫ్'. Beware of Burglar... అనేది ఉపశీర్షిక. ఇందులో మీనాక్షి జైస్వాల్ హీరోయిన్. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా పతాకంపై పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మించిన చిత్రమిది. దీనికి ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు.
2/5

'జ్యువెల్ థీఫ్' సినిమాలో '30 ఇయర్స్' పృథ్వీ రాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 8న థియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాత మల్లెల ప్రభాకర్ చెప్పారు.
3/5

'జ్యువెల్ థీఫ్'లో సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసే విధంగా ఆయన హెయిర్ స్టైల్, డ్రస్సింగ్ డిజైన్ చేశామని దర్శకుడు చెప్పారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసిందని ఆయన తెలిపారు.
4/5

కృష్ణ సాయి మాట్లాడుతూ... ''నేను సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. ఒకప్పటి హీరోయిన్ ప్రేమ, పృథ్వీ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. అందరికీ నచ్చేలా సినిమా తీశాం'' అని చెప్పారు.
5/5

కృష్ణ సాయి, మీనాక్షి జైస్వాల్ మీద బ్యాంకాక్, థాయిలాండ్ లో కలర్ ఫుల్ లొకేషన్లలో పాటలను గ్రాండ్ గా చిత్రీకరించామని దర్శకుడు తెలిపారు. ఇంకా తమ సినిమాలో ప్రేమ, అజయ్, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు నటించారని చెప్పారు.
Published at : 29 Oct 2024 11:53 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















