అన్వేషించండి
BiggBoss Telugu 8Jyothi Rai: బిగ్ బాస్ హౌస్ లోకి గుప్పెడంత మనసు జ్యోతి రాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ!
BiggBoss Telugu 8Jyothi Rai: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నడుస్తోంది. కంటెస్టెంట్స్ అంతా ఆరంభం నుంచి గొడవలకు దిగారు. ఈ హీట్ ను డైవర్ట్ చేసేందుకు జగతి మేడం రంగంలోకి దిగబోతోందట..
BiggBoss Telugu 8Jyothi Rai (Image Credit: jyothipoorvaj/Instagram)
1/6

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నడుస్తోంది. కొట్టుకునేందుకే హౌస్ లోకి వచ్చాం అన్నట్టు కంటెస్టెంట్స్ అంతా ఆరంభం నుంచి గొడవలకు దిగారు. హీట్ అంటే ఇదికాదంటూ గుప్పెడంతమనసు జగతి మేడం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోందట
2/6

కార్తీకదీపం సీరియల్ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది గుప్పెడంతమనసు. ఈ సీరియల్ సక్సెస్ లో రిషి, వసుధార, జగతి ముగ్గురు పాత్రలు కీలకం అనే చెప్పాలి
3/6

సీరియల్ ఆరంభం నంచి ఎండ్ ఫ్రేమ్ వరకూ జగతి మేడం లేకుండా సాగలేదు. మధ్యలోనే ఆమె క్యారెక్టర్ ని చంపేసినా కానీ ఆమె రాసిన లెటర్ తోనే శుభం కార్డ్ పడింది..
4/6

ఈ సీరియల్ లో కొడుకు ప్రేమకోసం తపించే తల్లిగా, స్టూడెంట్ భవిష్యత్ కోసం తాపత్రయపడే గురువుగా జగతిగా అద్భుతంగా నటించింది జ్యోతిరాయ్. ఈ సీరియల్ తో భారీ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది
5/6

ఈ సీరియల్ నుంచి బయటకు వచ్చేసి సినిమాలు,వెబ్ సిరీస్ లలో బిజీ అయిన జ్యోతీరాయ్..అసలు లుక్ బయటపెట్టింది. సీరియల్ లో పద్ధతిగా చీరకట్టిన జగతి..సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ లో హాట్ హాట్ గా కనిపించింది
6/6

జ్యోతిరాయ్ లుక్ చూసి ఆశ్చర్యపోని నెటిజన్ లేరు..అప్పటి నుంచి ఆమె సింగిల్ పిక్ షేర్ చేసినా ఓ రేంజ్ లో వైరల్ అయిపోతోంది. లేటెస్ట్ గా జ్యోతిరాయ్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందంటున్నారు. ఈ లోగా షూటింగ్స్ పూర్తిచేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటోందట జ్యోతిరాయ్.
Published at : 05 Sep 2024 04:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
ఇండియా
తిరుపతి
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















