Co-branded credit cards offers: క్రెడిట్ కార్డులు (Credit Cards) ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆర్థిక జీవితంలో భాగమయ్యాయి! ప్రముఖ ఈ-కామర్స్ వేదికలు, సంస్థలు, బ్యాంకులు కలిసి ఇప్పుడు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను (co-branded credit cards) జారీ చేస్తున్నాయి. తరచూ ఒకే వేదికలో కొనుగోళ్లు చేస్తున్న కస్టమర్లకు బెనిఫిట్స్ అందిస్తున్నాయి. వారు చేస్తున్న లావాదేవీలపై అదనపు క్యాష్‌బ్యాక్ (Cash Back), రివార్డు పాయింట్లు (Reward Points), ప్రత్యేక రాయితీలు (Special Discounts) ఇస్తున్నాయి.
మీ అవసరం ఏది: కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు తీసుకొనే ముందు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి! ఒక కేటగిరీలో మీరు ఖర్చుచేసే తీరును బట్టి కార్డును ఎంచుకోవాలి. ఒక నెలలో ఎక్కువగా పెట్రోలు, డీజిల్‌పై ఖర్చు చేస్తున్నారా? ప్రయాణాలు, షాపింగ్‌పై ఎక్కువ ఖర్చు చేస్తున్నారా? వంటివి సమీక్షించుకుంటే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు.
Amazon Pay ICICI Credit Card: అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు చాలా ప్రయోజనాలను అందిస్తోంది. ప్రైమ్ మెంబర్లకు అమెజాన్‌లో 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. నాన్ ప్రైమ్ మెంబర్లకు 3 శాతం ఇస్తోంది. 100కు పైగా మర్చంట్ పార్ట్‌నర్లపై 2 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఇతర లావాదేవీల పైనా 1 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. అమెజాన్ ఇండియాలో షాపింగ్‌పై 3, 6 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ చేస్తోంది. పైగా ఇది జీవితకాలం ఉచిత క్రెడిట్ కార్డు.
Flipkart Axis Bank Credit Card: మరో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్‌కార్ట్ కూడా యాక్సిస్ బ్యాంకుతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఇస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్, మింత్రాలో షాపింగ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్, ఉబెర్, క్యూర్ ఫిట్, క్లియర్ ట్రిప్, 1ఎంజీపై 4 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. అలాగే దేశంలోని పార్ట్‌నర్ రెస్టారెంట్లలో డైనింగ్‌పై 20 శాతం రాయితీ అందిస్తోంది. ఏడాదిలో నాలుగు సార్లు లాంజ్ యాక్సెస్ ఇస్తోంది. ఈ క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు రూ.500.
Indian Oil Citibank Platinum Card: ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుల్లో ఖర్చు చేసే ప్రతి రూ.150పై ఇండియన్ ఆయిల్, సిటీ బ్యాంక్ ప్లాటినం కార్డు నాలుగు టర్బో పాయింట్లు ఇస్తోంది. అధీకృత ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్లలో ఇంధన ఖర్చులపై 1 శాతం సర్‌ఛార్జ్‌ను తిరిగి ఇస్తోంది. సూపర్ మార్కెట్లు, నిత్యావసర సరులకుపై ప్రతి రూ.150పై 2 టర్నో పాయింట్లు ఇస్తోంది. ఒక టర్బో పాయింట్ ఒక రూపాయి ఉచిత ఇంధనానికి సమానం. అయితే ఈ కార్డు ఫీజు రూ.1000.
BPCL SBI Credit Card Octane: బీపీసీఎల్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఆక్టేన్ ఏడాది వార్షిక ఫీజు చెల్లింపుపై 6000 బోనస్ రివార్డు పాయింట్లను అందిస్తోంది. బీపీసీఎల్ ఫ్యూయెల్, లూబ్రికెంట్లు, భారత్ గ్యాస్‌పై ప్రతి రూ.100కు 25 రివార్డు పాయింట్లు ఇస్తోంది. రూ.4000 వరకు 1 శాతం సర్‌ఛార్జ్‌ను వాపస్ ఇస్తోంది. ఏడాది పొడవునా మూడు నెలలకు ఒకసారి చొప్పున నాలుగుసార్లు డొమస్టిక్ లాంజ్ యాక్సెస్ ఇస్తోంది. ఈ కార్డు వార్షిక ఫీజు రూ.1499.
Axis Vistara Signature Card: యాక్సిస్ విస్తారా సిగ్నేచర్ కార్డుపై చాలా ఆఫర్లు ఉన్నాయి. కాంప్లిమెంటరీ ప్రీమియం ఎకానమీ టికెట్ వోచర్, క్లబ్ విస్తారా మెంబర్‌షిప్ వోచర్, ఎంపిక చేసిన ఎయిర్ పోర్టులో డొమస్టిక్ లాంజ్ యాక్సెస్ ఇస్తోంది. ఈ క్రెడిట్ కార్డుతో ఖర్చు చేసే ప్రతి రూ.200పై 4సీవీ పాయింట్లు ఇస్తోంది. కస్టమర్లకు రూ.2.5 కోట్ల మేర ఎయిర్ యాక్సిడెంట్ కవర్ అందిస్తోంది. ఈ కార్డు వార్షిక ఫీజు రూ.3000.
జాగ్రత్త అవసరం: క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను మీరెంత బాగా ఉపయోగిస్తున్నారనేది ముఖ్యం. వడ్డీ రహిత కాలాన్ని ఇస్తున్నప్పటికీ వేరే కేటగిరీపై ఎక్కువ ఖర్చు చేసే ప్రమాదం ఉంది. బోనస్, రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాంక్ పొందాలంటే అతిగా ఉపయోగించడం మానేయాలి. ఎక్కువ ఖర్చు చేసి డబ్బులు సకాలంలో చెల్లించకపోతే ఆలస్య రుసుముతో పాటు వార్షిక ప్రాతిపదికన 28 నుంచి 49 శాతం వరకు వడ్డీ వేసే అవకాశం ఉంది.
Business News: బంగారం మెరుపుల్లేవ్ - మార్కెట్లో ఒక్క రోజే రూ.3.5 లక్షల కోట్లు మటాష్!
Household Financial Assets: ప్రజలు 2022లో ఎంత డబ్బు ఎక్కడ దాచుకున్నారో తెలుసా? మీరు ఊహించిందేమీ కాదు!
Business News: 18K పైనే నిఫ్టీ క్లోజింగ్ - నేడు బంగారం, వెండి మెరుపులు లేవ్!
Business News: రూపాయి 28 పైసలు డౌన్ - బంగారం, వెండి పైపైకి!
Stock Market Today: ఆకాశమే హద్దుగా వెండి ధర! ఫుల్ జోష్‌లో మార్కెట్లు
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!