YS Sharmila News: ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల నియామకం, ఏఐసీసీ ఉత్తర్వులు
YS Sharmila: ఇన్నాళ్లు పీసీసీ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజుకు, ఆయన పని తీరుకు ఏఐసీసీ అభినందనలు తెలిపింది. సీడబ్లూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్ర రాజును నియమించింది.
YS Sharmila Appointed as AP Congress Chief: ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలా రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని వాటిలో పేర్కొంది. సీడబ్లూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్ర రాజును నియమించింది. ఇన్నాళ్లు పీసీసీ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజుకు, ఆయన పని తీరుకు అభినందనలు తెలిపింది.
షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఇటీవల ఆమె కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరకముందు నుంచే ఆమెకు ఏపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జోరుగా సాగింది. తాజాగా ఆ ప్రచారమే నిజం అయింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలను ఆమెకు అప్పగించింది.