Indian women work Hours : ఇండియాలో మహిళా ఉద్యోగులపైనే అత్యధిక పని ఒత్తిడి - ఆఫీసులో రోజుకు 10 గంటలు !
EY employee Anna Sebastian death: ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా చనిపోయిన EY ఉద్యోగిని అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. తాజాగా భారత్‌లో మహిళా ఉద్యోగుల పని గంటలపై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Young Indian women work 55 hours a week highest globally : భారతీయ మహిళా ఉద్యోగినులు ప్రపంచంలో ఇతర దేశాల మహిళలతో పోలిస్తే అత్యధిక సమయం పని చేస్తున్నారు. ఒక్కొక్కరు సగటున వారానికి 55 గంటలు పని చేస్తున్నారని యూరోపియన్ యూనియన్ కు చెందిన యూరో స్టాట్ డాటా తెలిపింది. వారానికి ఐదు రోజుల పని గంటలు అంటే.. రోజుకు పదకొండు గంటలు పని చేస్తున్నట్లుగా లెక్క. భారత్ లో ఎనిమిది గంటల పని విధానం అమల్లో ఉంది. ఆ ప్రకారం చూసుకున్నా అత్యధిక సమయం పని చేస్తున్నట్లే. ప్రపంచ సగటు చూస్తే..ఇది నలభై గంటలు మాత్రమే. అంటే ప్రపంచంలోని ఇతర మహిళలు అందరూ వారానికి సగటున నలభై గంటల పాటు పని చేస్తే భారత్‌లో మహిళలు మాత్రం యాభై ఐదు గంటలు పని చేస్తున్నారు.
ఇటీవల భారత్‌లోని యర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీలో సీఏగా పని చేస్తున్న కేరేళకు చెందిన అన్నా సెబాస్టియన్ అనే ఇరవై ఆరేళ్ల మహిళ పని ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురై చనిపోయారు. ఈ అంశంపై కార్పొరేట్ ప్రపంచంలో విస్తృత చర్చ జరుగుతోంది. పని ప్రదేశంలో ఉద్యోగినులకు మరింత ఫ్లెక్సిబలిటీ ఉండాలని..వారిపై ఒత్తిడి తగ్గించాలన్న చర్చ జరుగుతోంది. ప్రతి కార్పొరేట్ మహిళ ఉద్యోగి ... అన్నా సెబాస్టియన్ మృతిపై స్పందిస్తున్నారు. తమ తమ కార్యాలయాల్లో ఉండే పని ఒత్తడిని షేర్ చేసుకుంటున్నారు. ఈవైతో పాటు డెలాయిట్ వంటి సంస్థలు.. తమ వర్క్ కల్చర్‌లో మహిళలకు మరింత అనుకూలంగా ఉండేలా మార్పులు చేయడంపై దృష్టి సారిస్తామని ప్రకటనలు కూడా చేశాయి.
సోదరుడి కోసం పవన్‌కు సూర్య క్షమాపణలు చెప్పాడా ? అసలు నిజం ఇదిగో
అన్నా సెబాస్టియన్ మృతి అంశం తర్వాత మహిళలపై ఒత్తిడి, ఉద్యోగంలో సమస్యలు, పని వేళలు ఇలా అన్నీ చర్చకు వస్తున్నాయి. భారత్‌లో మహిళా ఉద్యోగులు.. ఇతర దేశాలతో పోలిస్తే.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటారు. ఇప్పటికే అనేక టెక్ కంపెనీల్లో మహిళా ఉద్యోగుల శాతం పది శాతం కూడా ఉండదు. అయినా వారిపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. రోజువారీ సమయం కంటే.. ఎక్కువగా పని చేయాల్సి వస్తోందని తెలుస్తోంది. అదే సమయలో భారతీయ మహిళలు ఇంటి పనులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మరితం ఒత్తిడి గురి చేసే అంశంగా మారుతోంది.
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
ఇటీవలి కాలంలో కార్పొరేట్ కంపెనీలు కాస్ట్ కటింగ్ ఉద్యోగుల్నితగ్గించుకుని ఆ పని భారాన్ని ఇతరులపై మోపుతున్నాయి. ఈ కారమంగా కూడా కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులపై పని భారం పెరుగుతోంది. మహిళలు ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని.. అనారోగ్యానికి గురవుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అన్నా సెబాస్టియన్ మృతి తర్వాత అయినా పని పరిస్థితుల్లో మార్పులు రావాలని పలువురు మహిళా ఉద్యోగులు కోరుకుంటున్నారు.