Fack Check : సోదరుడి కోసం పవన్‌కు సూర్య క్షమాపణలు చెప్పాడా ? అసలు నిజం ఇదిగో
hero Suriya : తిరుపతి లడ్డూ అంశంపై హీరో కార్తీ స్పందించిన తీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తన సోదరుడి విషయంలో సారీ చెబుతున్నట్లుగా సూర్య చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. కానీ నిజం వేరు.
is hero Surya has also apologized to Pawan Kalyan : తిరుపతి లడ్డూ కల్తీ వివాదం అనేకానేక మలుపులు తిరుగుతున్నయి. అత్యంత సున్నితమైన ఈ విషయంలో ఎలా స్పందించినా స్పందించినా సమస్యగా మారుతోంది. తన కొత్త సినిమా సత్యం సుందరం సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సూర్య.. లడ్డూ అంశం సున్నితమైనదని ఇప్పుడు మాట్లాడకూడదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే ఆయన స్పందించిన తీరు.. హావభావాలు కాస్త తేడాగా ఉండటంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కార్తీ స్పందించారు. పవన్ కు క్షమాపణలు చెప్పారు.
Dear @PawanKalyan sir, with deep respects to you, I apologize for any unintended misunderstanding caused. As a humble devotee of Lord Venkateswara, I always hold our traditions dear. Best regards.
— Karthi (@Karthi_Offl) September 24, 2024
అయితే కాసేపటికి ఓ ట్వీట్ వైరల్ అయింది. అది కార్తీ సోదరుడు హీరో సూర్య పేరుతో ఉన్న టిట్టర్ అకౌంట్ నుంచి వచ్చినట్లుగా ఉంది. తన సోదరుడు చేసిన తప్పునకు తాను కూడా క్షమాపణలు చెబుతున్నానని.. పవన్ కు మద్దతుగా మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని చెప్పారు. కాసేపటికే ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది. లక్షల మంది చూశారు.
I am deeply sorry for the comments made by my brother on laddu in the recent audio function and for that I am also going for 3 Days Deeksha for my brother's words @PawanKalyan garu https://t.co/prcd7DrdlD
— Suriya Shivakumar (@Suriya_offt) September 24, 2024
అయితే కాస్త పరిశీలనగా చూస్తే ఆ ట్వీట్ .. సూర్య అపీషియల అకౌంట్ నుంచి వచ్చింది కాదని.. ఎవరో ఫేక్ చేశారని అర్థమైపోతుంది. ట్వీట్ చేసిన అకౌంట్ కు బ్లూటిక్ వెరిఫికేషన్ లేదు. సూర్య అకౌంట్‌కు ఉంటుంది. సూర్య అఫీషియల్ అకౌంట్ @Suriya_offl పేరుతో ఉంది.
From our hearts to yours, sharing with pride & great joy... a beautiful journey coming your way dear all 😊 #MeiyazhaganTeaser https://t.co/uq5TknkCcu https://t.co/EEiomx1rWs
— Suriya Sivakumar (@Suriya_offl) September 7, 2024
కానీ ట్వీట్ చేసిన అకౌంట్ మాత్రం @Suriya_offt ఐడీతో ఉంది. అంటే.. చివరి అక్షరం ఎల్ బదులుగా టి అని గుర్తించకుండా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసేసి.. ఈ ట్వీట్ చేశారని అర్థం చేసుకోవచ్చు.
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
సోషల్ మీడియాలో రీచ్ కోసం.. లేదా వివాదాస్పద ప్రకటనలు చేయడం కోసం.. రాజకీయ పార్టీల తరపున ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం కోసం.. వందల కొద్దీ ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ అకౌంట్ క్రియేట్ చేసి గందగోళం సృష్టిస్తున్నారని అనుమానిస్తున్నారు.