యుద్ధానికి సై, వాళ్ల అంతు చూసే దాకా వదలం - ఇజ్రాయేల్ ప్రధాని వార్నింగ్
Benjamin Netanyahu: పాలస్తీనా ఉగ్రవాదులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
Israel at War:
నెతన్యాహు ప్రకటన..
ఇజ్రాయేల్లో పాలిస్తానీ ఉగ్రసంస్థ హమాస్ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 5 వేల రాకెట్లతో విధ్వంసం సృష్టించాయి. ఈ దాడుల్లో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయేల్ ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. గాజీ సరిహద్దు ప్రాంతం వద్ద 80 కిలోమీటర్ల వరకూ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ దాడులపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రజల్ని ఉద్దేశిస్తూ (Benjamin Netanyahu) స్పెషల్ వీడియో విడుదల చేశారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. హమాస్ ఉగ్రవాదులు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
"మనం యుద్ధ వాతావరణంలో ఉన్నాం. మేం కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాం. ఈ ఉదయం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్ ప్రజల మీద మెరుపుదాడులు చేశారు. వాళ్లను ఆందోళనకు గురి చేశారు. వాళ్లకు కచ్చితంగా దీటైన బదులు చెప్తాం. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ యుద్ధంలో మనం తప్పకుండా గెలుస్తాం"
- బెంజమిన్ నెతన్యూహు, ఇజ్రాయేల్ ప్రధాని
#WATCH | Hamas terrorists' attack on Israel: "We are at war, not in an operation or in rounds, but at war. This morning, Hamas launched a murderous surprise attack against the State of Israel and its citizens...The enemy will pay an unprecedented price...We are at war and we will… pic.twitter.com/kxMO5Ry039
— ANI (@ANI) October 7, 2023
పదుల సంఖ్యలో రాకెట్లను ఇజ్రాయేల్పైకి పంపుతున్నారు హమాస్ ఉగ్రవాదులు (Hamas Militants). పౌరులందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఈ దాడుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇజ్రాయేల్ భూభాగంలోకి కొందరు ఉగ్రవాదులు అక్రమంగా చొరబడ్డారని ప్రకటించింది. గాజా సరిహద్దు ప్రాంతంలో దాడులకు తెగబడుతున్నారని వెల్లడించింది. ఈ రాకెట్ దాడుల మోత జెరూసలేం వరకూ వినిపిస్తోందని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ దాడులకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటి అథెంటిసిటీ గురించి స్పష్టత లేకపోయినా...చాలా మంది వీటిని షేర్ చేస్తున్నారు. చాలా చోట్ల కాల్పులు కూడా జరుగుతున్నాయి. గాజా పరిసర ప్రాంతాల్లో రాకెట్ దాడుల శబ్దం మారు మోగుతోంది. అటు టెల్ అవీవ్లోనూ సైరన్ల మోత మోగుతోంది. ఈ దాడులతో ఇజ్రాయేల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గాజా సరిహద్దు వద్ద 80 కిలోమీటర్ల పరిధి వరకూ ఎమర్జెన్సీ ప్రకటించింది. "State of War"గా డిక్లేర్ చేసింది. ఉగ్రదాడులను తిప్పి కొట్టేందుకు "Operation Iron Swords" ని లాంఛ్ చేసింది. ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. ఫైటర్ జెట్స్ని సిద్ధం చేసుకున్నాయి. దాదాపు అరగంట పాటు ప్రజలు గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడిపారు. రాకెట్ దాడిలో ఓ 70 ఏళ్ల వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. చికిత్స అందించేలోగా ప్రాణాలు కోల్పోయింది. మరో 20 ఏళ్ల వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
Also Read: ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాల్సిందే, భారత్ తరపున పుతిన్ పోరాటం