Sri Lanka New President: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే
Ranil Wickremesinghe Sri Lanka New President: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు.
Ranil Wickremesinghe Sri Lanka New President: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో ఎంపీలు.. రణిల్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
- మొత్తం పోలైన ఓట్లు: 223
- విక్రమసింఘే: 134
- అలాహ పెరుమా: 82
- అనురాకుమార్: 3
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది
The country is in a very difficult situation, we have big challenges ahead, says Sri Lanka's newly appointed President Ranil Wickremesinghe: Reuters
— ANI (@ANI) July 20, 2022
(File photo) pic.twitter.com/ZfAjhYS5Iw
44 ఏళ్లలో తొలిసారి
దేశాన్ని దివాలా తీయించి మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స విదేశాలకు పారిపోవడంతో కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. నిజానికి గొటబాయ 2024 నవంబరు వరకు పదవిలో ఉండాల్సింది. ఆయన రాజీనామా చేయడంతో కొత్తగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే ఆ గడువు వరకు పదవిలో కొనసాగుతారు.
లంక పార్లమెంటు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడం గత 44 ఏళ్లలో ఇదే తొలిసారి. పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులున్నారు. ఇందులో 223 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.
మరోవైపు మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. మాల్దీవుల నుంచి సింగపూర్ వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన పార్లమెంటుకు రాజీనామా లేఖను పంపారు. దీంతో కొత్త అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకుంది. గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్నే ఎంపీలు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
Also Read: NEET Frisking Row: నీట్ ఫ్రిస్కింగ్ కేసులో ఐదుగురు మహిళలు అరెస్ట్- ఫ్యాక్ట్ చెక్ కమిటీ ఏర్పాటు
Also Read: Corona Cases: దేశంలో మళ్లీ 20 వేల కరోనా కేసులు- 40 మంది మృతి