అన్వేషించండి

Russia Ukraine War: రష్యాకు భారీ ఎదురుదెబ్బ- ఉక్రెయిన్‌కు అమెరికా అత్యాధునిక ఆయుధ సాయం!

Russia Ukraine War: రష్యా యుద్ధం వేళ ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం ప్రకటించింది. నిర్ణీత లక్ష్యాలను నాశనం చేసే అత్యాధునిక రాకెట్ వ్యవస్థలను అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది.

Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు 3 నెలలు దాటిన తర్వాత అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ఉక్రెయిన్‌కు నేరుగా సాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముందుకొచ్చారు. సుదీర్ఘ నిర్ణీత లక్ష్యాలను నాశనం చేసే అత్యాధునిక రాకెట్‌ వ్యవస్థను ఉక్రెయిన్‌కు అందించేందుకు బైడెన్‌ అంగీకరించారు.

ఎప్పటి నుంచో

రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచే అత్యాధునిక ఆయుధ సంపత్తి కావాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్ కోరుతోంది. అయితే ఐరోపా దేశాలు తప్ప అమెరికా నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు పెద్దగా సాయం ఏం అందలేదు. కానీ చివరికి బైడెన్.. ఉక్రెయిన్‌కు రాకెట్ లాంఛర్లు అందించేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 80 కిలోమీటర్ల రేంజ్‌లోని లక్ష్యాలను నాశనం చేస్తాయి ఈ రాకెట్లు. 

కానీ 

అయితే ఉక్రెయిన్‌ భూభాగంపై రష్యా దాడులను తిప్పికొట్టడానికే తప్ప రష్యా భూభాగంలో మాత్రం ఆ రాకెట్లను ప్రయోగించడానికి వీల్లేదని షరతు పెట్టారు బైడెన్. ఈ మేరకు బైడెన్‌ బుధవారం స్వయంగా ప్రకటించారు.  అలాగే ఉక్రెయిన్‌ నుంచి హామీ తీసుకున్న తర్వాతే ఈ సాయానికి అమెరికా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

" ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర దౌత్యం ద్వారా ముగుస్తుందని భావిస్తున్నాం. అయితే చర్చల సమయంలో ఉక్రెయిన్‌ పైచేయి సాధించేందుకే గణనీయమైన ఆయుధ సంపత్తిని, మందుగుండు సామగ్రిని అందించబోతున్నాం.                                                           "
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ఉక్రెయిన్‌కు అమెరికా ఇచ్చే ఆయుధ ప్యాకేజీలో రాకెట్‌ వ్యవస్థలు, మందు గుండుతో పాటు కౌంటర్‌ ఫైర్‌ రాడార్లు, ఎయిర్‌ సర్వేలెన్స్‌ రాడార్లు, జావెలిన్‌ యాంటీ టాంక్‌ మిస్సైల్స్‌, యాంటీ ఆర్మర్‌ వెపన్స్‌ ఉండనున్నాయి.

3 నెలలు

రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై మే 24 నాటికి 90 రోజులైంది. ఇప్పటివరకు ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌పై రష్యా దళాలు వైమానిక దాడులు చేశాయి, ఎన్నో నగరాలను హస్తగతం చేసుకున్నాయి. ఇది పైకి కనిపించేది. అయితే యూరోప్ దశాబ్దాలుగా చూడని హింసాత్మక ఘటనలను ఈ మూడు నెలల్లో చూసింది. రష్యా మొదలుపెట్టిన ఈ దాడి వల్ల మాస్కోకు, పశ్చిమ దేశాలకు మధ్య ఇక పూడ్చలేని దూరం ఏర్పడింది. ఈ ఒక్క యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, ఆకలి చావులు మొదలయ్యాయి.

రష్యా మొదలుపెట్టిన ఈ దాడి ఇప్పట్లో పూర్తి కాదని ఐరోపా నిఘా విభాగాలు ముందే అంచనా వేశాయి. అయితే ఇది ప్రపంచాన్నే వణికిస్తుందని మాత్రం అనుకోలేదు. ఉక్రెయిన్‌ను నామ రూపాల్లేకుండా చేయడానికి రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఐరోపా దేశాలకు యుద్ధం మొదలైన తర్వాతే అర్థమైంది.

Also Read: UPSC 2021: ఎంత పనిచేశారు భయ్యా! ఐశ్వర్య అంటే అమ్మాయ్ అనుకున్నాంగా!

Also Read: Hurricane Agatha: మెక్సికోలో 'అగాథ' హరికేన్ బీభత్సం- 10 మంది మృతి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget