Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!
Pakistan: పాకిస్థాన్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.

Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
We are deeply saddened by the loss of precious lives in the unfortunate bus accident in #Zhob. In this hour of grief, our thoughts are with the families & friends affected by this tragedy. We also wish a speedy recovery to all the injured.#Balochistanhttps://t.co/H3Az5TPXxk
— German Embassy Islamabad (@GermanyinPAK) July 3, 2022
ఇలా జరిగింది
క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన బస్సు జోబ్‌లో ఓ లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. భారీ వర్షం, అతివేగం కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు.
గాయపడిన 11 మందిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
ప్రధాని సంతాపం
ఈ ప్రమాదంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఇటీవల
పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో ఇటీవల కూడా ఓ బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
వధ్ నుంచి దాడు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కుజ్దార్లోని కోరి ప్రాంతంలో అధిక వేగం కారణంగా బస్సు అదుపుతప్పినట్లు స్పష్టం చేశారు.
పాకిస్థాన్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. లోయలు, కొండ ప్రాంతాల్లో డ్రైవర్లు నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపై ప్రభుత్వ దృష్టి సారించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే ఇలాంటి ప్రమాదాలు తగ్గుతాయని సూచిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.
Also Read: Lalu Prasad Yadav hospitalized: మెట్లపై నుంచి జారిపడిన బిహార్ మాజీ సీఎం లాలూ- భుజానికి ఫ్రాక్చర్
Also Read: Agnipath Scheme: 'అగ్నిపథ్'ను రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్- వచ్చే వారం విచారణ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

