Kim Jong Un: ఏటా 25 మంది అమ్మాయిలతో కిమ్ రాసలీలలు, వర్జినిటీ టెస్ట్ పాసైన వారికే ఆ అవకాశం
Kim Jong Un: కిమ్ కోసం ప్రత్యేకంగా ఏటా 25 మంది వర్జిన్స్ అయిన యువతులను ఎంపిక చేసి ప్లెజర్ స్క్వాడ్‌ని ఏర్పాటు చేస్తారని బ్రిటీష్ వార్తా సంస్థ సంచలన విషయం చెప్పింది.
Kim Pleasure Squad: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un Life Style) గురించి ఏ చిన్న వార్తైనా సరే ప్రపంచమంతా అది సంచలనమే. ఆ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నారు కిమ్. ఆయన స్టైల్ నుంచి లైఫ్‌స్టైల్ వరకూ అంతా ఆసక్తికరమే. ఈ క్రమంలోనే ఓ నివ్వెరపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటీష్ మీడియా Daily Star పబ్లిష్ చేసిన ఓ వార్త ఆసక్తితోపాటు ఆశ్చర్యాన్నీ కలిగిస్తోంది. కిమ్ ఏటా 25 మంది వర్జిన్స్‌ని ఎంపిక చేసుకుంటారని, వాళ్లతో సన్నిహితంగా గడుపుతాడని చెప్పింది. అంతే కాదు. ఈ 25 మందిని "Pleasure Squad" గా పిలుస్తారని వెల్లడించింది. అందంగా ఉన్న వాళ్లని ఎంపిక చేసి వాళ్లకి మాత్రం ఈ స్క్వాడ్‌లో జాయిన్ అయ్యే అవకాశం కల్పిస్తారట. నార్త్ కొరియా నుంచి నిషేధానికి గురైన ఓ యువతి (Kim Jong Un Pleasure Squad) ఈ విషయమంతా చెప్పినట్టు డెయిలీ స్టార్ రిపోర్ట్ చేసింది. ఆమె మాటల్లో చెప్పాలంటే...కిమ్‌జాంగ్ ఉన్ ప్లెజర్ స్క్వాడ్‌ని ఏర్పాటు చేసే ముందు పెద్ద తతంగమే జరుగుతుంది. కిమ్ తరపున కొందరు వ్యక్తులు అన్ని కాలేజ్‌లకు వెళ్తారు. అక్కడ ఒక్క క్లాస్‌రూమ్‌ని కూడా వదిలిపెట్టకుండా అందమైన యువతుల కోసం జల్లెడ పడతారు. వాళ్లకి నచ్చిన వాళ్లందరి లిస్ట్‌నీ తయారు చేస్తారు. ముందుగా వాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకుంటారు. నార్త్ కొరియా నుంచి తప్పించుకున్న వాళ్లు, సౌత్ కొరియాతో సంబంధం ఉన్న వాళ్లని పక్కన పెట్టేస్తారు. అలా ఫిల్టర్ చేసిన తరవాత కొంత మందిని ఎంపిక చేస్తారు. ఆ తరవాతే అసలు కథంతా మొదలవుతుంది.
వర్జినిటీ టెస్ట్‌లు చేసి..
ఇలా ఎంపిక చేసిన యువతులకు వర్జినిటీ టెస్ట్ చేస్తారు. అందులో ఏ చిన్న లోపం ఉందని తెలిసినా సరే వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఆ స్క్వాడ్‌లో ఉండడానికి అనర్హులుగా ప్రకటిస్తారు. ఇక ఈ టెస్ట్‌లో క్వాలిఫై అయిన యువతులను ప్యాంగ్యాంగ్‌కి పంపుతారు. అక్కేడ Pleasure Squad ని సిద్ధం చేస్తారు. అప్పటి నుంచి ఆ యువతులకు కిమ్‌ని ఎంటర్‌టైన్ తప్ప వేరే పనేమీ ఉండదు. మరో విషయం ఏంటంటే...ఈ స్క్వాడ్‌ని మూడుగా విభజిస్తారు. కొందరికి మసాజ్‌లు ఎలా చేయాలో నేర్పిస్తారు. మరి కొంత మందికి పాటలు పాడడం, డ్యాన్స్‌లు చేయడం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు. ఇంకొందరికి కిమ్‌తో ఎలా సన్నిహితంగా ఉండాలో చెబుతారు. ఇంత జరుగుతుంటే ఆ యువతుల తల్లిదండ్రులు ఏమీ అనరా అనే అనుమానం వస్తుంది. కానీ...ఇలా ప్లెజర్ స్క్వాడ్‌లో తమ కూతుళ్లు ఎంపిక కావడాన్ని కొందరు సమర్థించుకుంటారు. కనీసం అలా అయినా వాళ్లకు మూడు పూటలా తిండి దొరుకుతుందని, పేదరికం లేకుండా బతుకుతారని భావిస్తారు.
1970 నుంచే ఇదే సంప్రదాయం..
అయితే...ఈ యువతులకు 30 ఏళ్లు వచ్చే లోపు మాత్రమే ఈ స్క్వాడ్‌లో ఉంటారు. ఆ తరవాత వాళ్లని కిమ్ జాంగ్ ఉన్ బాడీ గార్డ్స్ పెళ్లి చేసుకుంటారు. ఇలా పెళ్లి చేసుకోవడాన్ని వాళ్లు చాలా గొప్పగా భావిస్తారు. నిజానికి ఉత్తరకొరియాలో ఈ సంప్రదాయం 1970 నుంచి కొనసాగుతోంది. టీనేజ్ యువతులతో ఇలా సన్నిహితంగా ఉంటే తమకు చావనేదే ఉండదని కొరియన్‌లు నమ్ముతారని, అందుకే అలా చేస్తారని కొందరు చెబుతున్నారు. డెయిలీ స్టార్ చెప్పిన మరో సంచలన విషయం ఏంటంటే...కిమ్ జాంగ్ ఉన్ భార్య కూడా ఒకప్పుడు ఇలాగే ప్లెజర్ స్క్వాడ్‌లో ఉన్నారు. ఎప్పటి నుంచో కిమ్ ఈ "లైఫ్‌స్టైల్"పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఓ వార్తా సంస్థ ఈ విషయం చెప్పడం సంచలనమవుతోంది.
Also Read: UAE Rains: యూఏఈలో మరోసారి భారీ వర్షాలు, నీట మునిగిన దుబాయ్ అబుదాబి - ఫ్లైట్‌లు రద్దు